iDreamPost
android-app
ios-app

AP ఎన్నికల బరిలో కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి?

Shyamala Devi: కేంద్ర మాజీ మంత్రి, దిగ్గజ నటుడు కృష్ణంరాజు కుటుంబానికి ఎంపీ సీటు ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మూడు పార్టీల నుంచి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఎన్నికల బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి టాక్ వినిపిస్తోంది.

Shyamala Devi: కేంద్ర మాజీ మంత్రి, దిగ్గజ నటుడు కృష్ణంరాజు కుటుంబానికి ఎంపీ సీటు ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మూడు పార్టీల నుంచి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఎన్నికల బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి టాక్ వినిపిస్తోంది.

AP ఎన్నికల బరిలో కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి?

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక వైసీపీ అయితే 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. విడతల వారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా వైసీపీ వెళ్తోంది. వీరి విషయం పక్కన పెడితే.. ఎన్నికల వచ్చిన ప్రతిసారి సినీ తారలు, వారి కుటుంబ గురించి ప్రస్తావన వస్తుంది. ఈసారి కూడా ఏపీ ఎన్నికల వేళ రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబ పేరు వార్తల్లో వినిపిస్తోంది. ఆయన సతీమణి శ్యామలదేవి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారన్నట్లు వార్తలు వస్తోన్నాయి.

టాలీవుడ్ దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు వారి మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. తనదైన నటనతో టాలీవుడ్ లో రెబల్ స్టార్ అనే బిరుదు పొందారు. నటనారంగం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన నటులలో కృష్ణంరాజు ఒకరు. రాజకీయాల్లో ఆయన అనేక ఆటుపోట్లను చవిచూశారు. బీజేపీ తరపున నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి  పోటీ చేసి విజయం సాధించారు. ప్రధానమంత్రి వాజపేయి కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. తాను మంత్రిగా, రాజకీయ నేతగా ఉండగా ప్రజలకు అనేక సేవలు చేయడమే కాకుండా, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోన్న వేళ.. మరోసారి ఆయన కుటుంబం పేరు వార్తల్లో వినబడుతోంది.

ఇప్పుడు ఆయన సతీమణి శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేస్తారని టాక్ వినిపించింది. గతంలో కృష్ణం రాజు పోటీ చేసిన నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అదే విధంగా టీడీపీ, జనసేనలు కూడా ఆమెను పార్టీలోకి ఆహ్వానించే పనిలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా తమ అభ్యర్థిగా కృష్ణం రాజు సతీమణి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా రెబల్ స్టార్ కుటుంబంపై ఎవరి లెక్కలు వారు వేసుకున్నట్లు వార్తలు వచ్చినా.. ప్రభాస్, శ్యామలదేవిల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. నేటి కృష్ణ రాజు జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, ఇతర సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాలో భారీగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన స్వగ్రామం మొగల్తూరులో హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌ నిర్వహణను శ్యామలాదేవి స్వయంగా చూసుకుంటున్నారు.

గతంలో కృష్ణం రాజు కర్మదిన కార్యక్రమంలో ప్రభాస్ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడి వచ్చిన జనాలను చూసి రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉభయగోదావరి జిల్లాలో రాజకీయాలను శాసించే స్థాయిలో వారి బలం ఉందని ఆ కార్యక్రమం ద్వారా స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడ్డారు. ఈ క్రమంలోనే అన్నిపార్టీలు కృష్ణం రాజు కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే పనిలో పడ్డాయని ప్రచారం జరుగుతుంది. అయితే వారి కుటుంబం నుంచి మాత్రం రాజకీయ రంగ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి.. శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.