Krishna Kowshik
తమ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కిందన్న ఆనందంలో ఉన్నారు లవర్స్. గత నెలలోనే వీరి పెళ్లి జరిగింది. భవిష్యత్తు గురించి ఆలోచన చేశారు. భార్య ఉన్నత చదువుల కోసం...
తమ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కిందన్న ఆనందంలో ఉన్నారు లవర్స్. గత నెలలోనే వీరి పెళ్లి జరిగింది. భవిష్యత్తు గురించి ఆలోచన చేశారు. భార్య ఉన్నత చదువుల కోసం...
Krishna Kowshik
ఈ ప్రేమికులు అందరిలాంటి వారు కాదు. వీరిది ఉన్నత ఆశయాలు.. జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు. పెద్దలను ఒప్పించి గత నెలలో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక బాధ్యతలను మర్చిపోలేదు. ఈ జంటను చూసి చిలకా గోరింకల్లా ఉన్నారని అనుకున్నారు. అంతలోనే విషాదాన్ని నింపుతూ.. ఇద్దరు మృతి చెందారు. ఇంకా పెళ్లి ఛాయలు మాసిపోనేలేదు.. అంతలో ఇరు కుటుంబాల్లో మానిపోని గాయాలను మిగిల్చారు. పెళ్లై నెల రోజులు కాకుండానే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నగరంలోని నవాబు పేటకు చెందిన కొప్పోలు ప్రశాంత్, మన్నా పుష్ప కొన్నాళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు.
ప్రశాంత్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పుష్ప రావూస్ విద్యా సంస్థల ఎంబీఏ చదువుతోంది. వీరి ప్రేమకు పెద్దలు ఓకే చెప్పడంతో గత నెల 8వ తేదీన వీరి వివాహం జరిగింది. కాగా, బుధవారం నుండి పుష్ప ఎంబీఏ పరీక్షలు జరుగుతున్నాయి. ఆమె పరీక్షా సెంటర్.. వెంకటాచలం మండలం కాకుటూరు దగ్గర కృష్ణ చైతన్య కళాశాల పడింది పుష్పకు. పుష్పను ప్రశాంత్ వాహనంపై తీసుకెళ్లి, తిరిగి తనను తీసుకు వస్తున్నాడు. గురువారం కూడా పరీక్షా కేంద్రానికి బండిపై బయలు దేరారు ఈ నూతన దంపతులు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష కాగా, ముందుగానే బయలు దేరారు. ఇంటి నుండి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దిచక్ర వాహనంపై పరీక్షా కేంద్రానికి వెళుతున్నారు.
చెముడు గుంట పంచాయతీలోని జిల్లా సైన్స్ కేంద్రం వద్దకు రాగారే.. వీరి వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్ స్కిడ్ అవ్వడంతో.. ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. ఆ సమయంలో వీరి వెనుకగా వస్తున్న ఆర్టీసీ బస్సు.. ఈ దంపతుల పై నుండి దూసుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రశాంత్, పుష్ప అక్కడిక్కడే మృతి చెందారు. పెళ్లై నెల రోజులు కూడా పూర్తి కాకుండానే..నూతన దంపతులిద్దరూ.. ఒకేసారి మరణించడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి పెళ్లి వేడుకలకు వెళ్లిన బంధువులంతా ఈ నూతన దంపతుల మరణ వార్త తెలుసుకుని కంటతడి పెడుతున్నారు. ఆ దంపతుల గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది.