iDreamPost
android-app
ios-app

లోకేశ్ ను టెన్షన్ పెడుతున్న చంద్రబాబు కొత్త ప్లాన్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ,జనసేనలో జరుగుతున్న పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు వేసిన ఓ కొత్త ప్లాన్, లోకేశ్ ను టెన్షన్ పెడుతుందనే టాక్ వినిపిస్తోంది.

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ,జనసేనలో జరుగుతున్న పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు వేసిన ఓ కొత్త ప్లాన్, లోకేశ్ ను టెన్షన్ పెడుతుందనే టాక్ వినిపిస్తోంది.

లోకేశ్ ను టెన్షన్ పెడుతున్న చంద్రబాబు కొత్త ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. ఇక్కడి నేతల మాటలు పొలిటికల్ సెగలు రేపుతుంటాయి. అంతేకాక ఇక్కడ కొందరి నేతల తీరు..అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదే సమయంలో టీడీపీ,జనసేనలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై అందరిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ-జనసేన కూటమి మొదటి ఉమ్మడి సభకు నారా లోకేష్ గైర్హాజరు  అయ్యారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లోకేష్‌ సభకు వస్తే జనసైనికులు మండిపడతారని వద్దన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో బాబు వేసిన ఓ ప్లాన్..లోకేశ్ కి కొత్త టెన్షన్ పుట్టిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత తొలిసారి రెండు పార్టీలూ కలిసి ఉమ్మడిగా జెండా సభను నిర్వహించాయి.ఈ బహిరంగ సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అయినా నారా లోకేష్ హాజరు కాకపోవడం పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడు కాగా నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. అంత కీలక పదవిలో ఉన్న లోకేశ్ ఎలక్షన్లకు ముందు పార్టీ నిర్వహించిన కీలక సభలో లేకపోవడం వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉందన్న టాక్ నడుస్తోంది. చంద్రబాబ..లోకేశ్ ను పక్కన పెట్టి పవన్ ను వేదిక ఎక్కించారంటూ రాజకీయ ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు.

నారా లోకేశ్ సభకు రాకపోవడానికి కారణాలేంటన్న అంశంపై ఇరుపార్టీల్లోనూ చర్చ జరుగుతోందంటున్నారు. నారా లోకేష్ ఈ సభకు హాజరైతే జనసైనికుల నుండి తీవ్ర స్థాయిలో నిరసన ఎదుర్కోవలసి వస్తుందని చంద్రబాబు భయపడ్డారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఈ సభకు లోకేష్‌ను రావద్దని స్వయంగా బాబే చెప్పారనే టాక్ నడుస్తోంది. కేవలం టీడీపీ సభలకు మాత్రమే లోకేష్‌ను పరిమితం చేసి.. ఉమ్మడి సభలకు చంద్రబాబు, పవన్ మాత్రమే హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీడీపీ కేడర్ లో వినిపిస్తోంది. ఎన్నికల నగారా మోగిన తర్వాత రెండు పార్టీల ఉమ్మడి సభలు మరికొన్ని జరుగుతాయి. వాటిలోనూ లోకేశ్ కనిపించరని అంటున్నారు.

లోకేశ్ పై మెజారిటీ జనసైనికులు పీకలదాకా కోపంగా ఉన్నారని, అందులో అనుమానమే లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  అందుకు కారణం కూడా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్  చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. అలానే జనసేనకు 24 స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించిన తర్వాత టీడీపీ వైఖరిపైనా జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారంట. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా నిర్వహించిన తొలి సభలోనే లోకేశ్ ఉంటే జనసైనికులు, పవన్ అభిమానులు నిరసనలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయని చంద్రబాబు భయపడినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా లోకేష్‌ను రానున్న ఉమ్మడి సభలకూ దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే తాను ప్రజలల్లోకి రాకపోతే.. ఎలా అనే కొత్త టెన్షన్ లోకేశ్ కి పట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.