Arjun Suravaram
Arjun Suravaram
మంగళవారం మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు లోకేశ్ కు సీఐడీ నోటీసులు ఇవ్వగా.. విచారణకు హాజరయ్యారు. ఇక ఈ కేసులో నారా లోకేశ్ ను ఏ-14గా ఉన్నారు. ఐఆర్ఆర్ కేసులో ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. లోకేశ్ ముందేగానే తాడేపల్లిలోని సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. అయితే ఈ విచారణపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక చంద్రబాబు మాదిరిలే విచారణ అనంతరం అరెస్ట్ కూడా జరగొచ్చని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. అయితే సీఐడీ చెేపటిన ఈ విచారణలో ఓ అంశం కీలకంగా ఉందని టాక్ వినిపిస్తోంది.
టీడీపీ ప్రభుత్వంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చి భారీ కుంభకోణానికి పాల్పడారని సీఐడీ ఆరోపిస్తుంది. చంద్రబాబుతో కలిసి అప్పటి మంత్రులు పి. నారాయణ, లోకేశ్ ఈ స్కాంకి పాల్పడ్డారని సీఐడీ తెలిపింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చి.. భారీగా లాభ పడ్డారని కోర్టుకు దాఖలు చేసిన మోమోలు సీఐడీ పేర్కొంది. ఈక్రమంలోనే నారా లోకేశ్ ను ఏ-14 నిందితుడిగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. ఇటీవలే కోర్టు ఆదేశాలతో ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు విచారణకు రావాలంటూ లోకేశ్ ను కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం నారా లోకేశ్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. సోమవారం ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన ఆయన.. మంగళవారం ఉదయం సిట్ కార్యాలయానికి వెళ్లారు.
ఉదయం10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విచారణ కొనసాగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ సంస్థ భూముల కొనుగోళ్లపై సీఐడీ లోకేష్‌ను ప్రధానంగా ప్రశ్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు 41 కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని సూచించింది. విచారణకు సహకరించాలని లోకేష్‌కు సూచించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరి.. విచారణ ఏ మలుపు తిరుగుంతుందో అని అందరిలో ఓ ఉత్కంఠ నెలకొంది. మరి..ఐఆర్ఆర్ కేసులో లోకేశ్ ను సీఐడీ విచారించే ప్రధానం అంశం హెరిటేజ్ గురించే అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపంలో తెలియజేయండి.