Arjun Suravaram
ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ , జనసేన పార్టీలు గెలుపే లక్ష్యాంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే చంద్రబాబు, పవన్ చేసిన ఓ బిగ్ మిస్టేక్ జగన్ కి వరంగా మారిందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.
ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ , జనసేన పార్టీలు గెలుపే లక్ష్యాంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే చంద్రబాబు, పవన్ చేసిన ఓ బిగ్ మిస్టేక్ జగన్ కి వరంగా మారిందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం మొదలైంది. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అంతేకాక బీజేపీని కూడ తమతో కలుపుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు సీఎం జగన్ ఒంటరిగానే పోరాడతానని చెబుతూ.. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పథకాల గురించి ప్రజలకు వివరించే కార్యక్రమం చేస్తూ జగన్ ఇప్పటికే ఒక విధంగా ప్రచారం ప్రారంభించారు. ప్రతిపక్షాలు ఇంకా పొత్తుల లెక్కల్లో ఉన్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన బిగ్ మిస్టేక్.. జగన్ కు వరంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ మిస్టేక్ ఏంటి, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విజయం కోసం శ్రమిస్తున్నాయి. టీడీపీలో అనుకున్న స్థాయిలో రాజకీయ కార్యక్రమాలు జరగడం లేదు. చంద్రబాబు వివిధ కేసులతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా జనసేన, టీడీపీ కలిసినా కూడా కేడర్ లో జోష్ పెరగడం లేదు. ఇదే సమయంలో తన పాలన గురించి ప్రజలకు వివరిస్తు జగన్ అప్రమత్తమయ్యారు. మరోసారి తానే అధికారంలోకి వస్తానే ధీమాతో జగన్ ఉన్నారు. అందుకు కూడా బలమైన కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.
జగన్ ట్రాప్ లో ప్రతిపక్షాలు చిక్కుకున్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల చుట్టూనే ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు అడుగులు వేయాల్సిన పరిస్థితిని సీఎం తీసుకొచ్చారు. జగన్ తన సంక్షేమ పాలనే నమ్ముకుని మరోసారి ఎన్నికలకు సిద్ధమతున్నారు. కానీ ఇదే సమయంలో టీడీపీ, జనసేన పూర్తిగా జగన్ వ్యతిరేకత ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకుంది. అసలు జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటింగ్ ఎంత శాతం ఉందనేదే ఇక్కడ ప్రశ్న. ఇది ఏ మేరకు ప్రతిపక్షాలను అధికారంలోకి రావడానికి సహకరిస్తుందనేది అందరిలో వ్యక్తమవుతున్న అనుమానం. సీఎం జగన్ 54 నెలల కాలంలో చేసిన పాలనా పరమైన అంశాల్లో వైఫల్యాలను ఎత్తిచూపడంలో టీడీపీ, జనసేనాలు విఫలమైనట్లు పొలిటికల్ సర్కిల్ లో టాక్.
ఇదే సమయంలో 60 శాతం వరకు వైసీపీకి అనుకూల ఓటింగ్ ఉందని స్వతంత్ర సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల నాటికి కొంత మేర తగ్గినా..అధికారం ఖాయమనే సంకేతాలు మాత్రం ఇస్తున్నాయి. ప్రతిపక్షాలు ..అసలు జగన్ ను ఎందుకు రిజెక్ట్ చేయాలి..తమను ఎందుకు గెలిపించుకోవాలని చెప్పటంలో ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వెనుకబడి ఉన్నారు. ఇక జనసేన, టీడీపీ పార్టీలు ఎన్నికల యుద్ధంలో యాక్టివ్ అయ్యే సరికి.. సీఎం జగన్ తన పని తాను చేసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 1 కోటి 40 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సంక్షేమ లబ్ధిని నేరుగా వారి అకౌంట్లో జమ చేశారు.
అంతేకాక తరచు భారీ బహిరంగ సభల్లో చంద్రబాబు, పవన్ గతంలో ఇచ్చిన హామీలు అమలు కాని విషయాన్ని గుర్తు చేస్తూ..తాను అధికారంలోకి రాకపోతే సంక్షేమం కొనసాగదని ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీ , జనసేనకు ప్రతికూలం అవుతోంది. ఈ రెండు పార్టీలు తాము ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథఖాలను అందిస్తామని చెప్పినా మద్దితిచ్చే వారి సంఖ్య తక్కవేనని స్పష్టం అవుతోంది. సంక్షేమం, ఏపీ పునర్నిర్మాణం పేరుతో ప్రజల్లోకి వచ్చినా..ఎంత మేరకు మద్దతు ఉంటుందనేది అనుమానమే. ఇలా ప్రతిపక్షా పార్టీలు జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే ఆయనకు వరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.