iDreamPost
android-app
ios-app

భువనేశ్వరి యాత్ర..! జగన్ ని అన్న మాటలు గుర్తున్నాయా?

ఏపీ రాజకీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయాలు ఇంకా హీటెక్కాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు కర్మాఫలితం అంటూ టీడీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. నాడు జగన్ ని అన్నమాటలు గుర్తున్నాయా అంటూ టీడీపీ నేతలపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి.

ఏపీ రాజకీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయాలు ఇంకా హీటెక్కాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు కర్మాఫలితం అంటూ టీడీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. నాడు జగన్ ని అన్నమాటలు గుర్తున్నాయా అంటూ టీడీపీ నేతలపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి.

భువనేశ్వరి యాత్ర..! జగన్ ని అన్న మాటలు గుర్తున్నాయా?

ఏపీ రాజకీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయాలు ఇంకా హీటెక్కాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు కర్మాఫలితం అంటూ టీడీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ కౌంటర్లకు టీడీపీ నేతలు రీకౌంటర్ ఇవ్వలేక అల్లాడిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన టీడీపీ నేతలు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా “నిజం గెలవాలి’ కార్యక్రమంతో నారా భువనేశ్వరి వెళ్ళనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు టీడీపీ నేతలు వీకెండ్ చివర్లో నిరసన కార్యక్రమాలు చేపట్టే వారు.

తాజాగా లోకేశ్ భవిష్యత్ గ్యారెంటీ, భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలను చేస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంపై  అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గెలిచింది నిజమే కాదా అంటూ వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ఈ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన బెడితే భువనేశ్వరి చేపట్టనున్న నిజం గెలవాలి కార్యక్రమంపై పొలిటికల్ గా అనేక కామెంట్స్ వినిపిస్తోన్నాయి. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి ఈ నిజం గెలవాలి అనే ప్రోగ్రామ్ చేపట్టినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే కాస్తా గతంలోకి వెళ్తే.. జగన్ ని అన్న మాటలు గుర్తులేవా? అంటూ టీడీపీ నేతలపై విమర్శలుు వస్తున్నాయి. కారణం..2009లో దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  మరణాన్ని తట్టుకోలేక ఎందరో మరణించారు.

అయితే టీడీపీ నేతలు, కొన్ని ఛానలు విష ప్రచారాలు చేశాయని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు. ఎక్కడ చనిపోయిన వారిని రాజశేఖర్ రెడ్డి మరణం కారణంగానే చనిపోయారని పేర్లు రాశారని, అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపడితే కూడా అదే విధమైన విషపు రాతలు రాశారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమాన్ని మాత్రం చాలా గొప్ప చెబుతున్నారు. అయితే సమయం వేరైనప్పటికి నాడు జగన్, నేడు భువనేశ్వరి ఓదార్పు యాత్ర చేపట్టారు. ఆనాడు జగన్ మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేసినందుకే నేడు టీడీపీ వాళ్లకు, చంద్రబాబుకు కర్మ ఫలితం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. నాడు జగన్ యాత్రను వక్రీకరించారు. నేడు అలాంటి యాత్రనే టీడీపీ నేతలు చేపట్టి గొప్పగా చెప్పుకుంటున్నారు.

ఇంకా  నిజం గెలవాలి కార్యక్రమం గురించి మాట్లాడుకుంటే.. చంద్రబాబు జైలుకు వెళ్లిన తరువాత మొదట్లో బాలకృష్ణ ప్రకటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయారని, వారిని ఓదార్చేందుకు వెళ్తాన్ని బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ నేడు ఆయనను ప్రక్కన పెట్టి.. నారా భువనేశ్వరి ఆ యాత్రను చేయనున్నారు. అయితే అసలు ఓదార్పు యాత్రను ప్రకటించిన బాలకృష్ణను పక్కన పెట్టి భునేశ్వరి గారితో ఎందుకు చేయిస్తున్నారనే  సందేహాలు పొటిలికల్ సర్కిల్ లో వ్యక్తమవుతున్నాయి. గతంలో టీడీపీ నేతలు, కొన్ని మీడియాలు జగన్ ను ఏవిధంగా ఇబ్బందులకు గురి చేశారో.. అవే కర్మల ఫలితాలు ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి.. నాడు జగన్ ఓదార్పు యాత్రను విమర్శించిన ఫలితామే నేడు టీడీపీ నేతలకు అనుభవిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.