తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడను రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆయనకు ఏసీబీ కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే చంద్రబాబు అరెస్ట్, రిమాండ్.. ఈ వరుస ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించాయి. చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జైలు గడప తొక్కినది లేదు. అలాంటి వ్యక్తిని ఏకంగా సెంట్రల్ జైలుకే పంపారు అధికారులు. దీంతో టీడీపీ ముఖ్యనేతలతో పాటు, ఆ పార్టీ కేడర్ పూర్తిగా నిరుత్సాహంలో కూరుకుపోయిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటికి బలం చేకూర్చేలానే నారా భువనేశ్వరి మాటలు ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
విజయవాడలోని ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడికి ఆదివారం సాయంత్రం 14 రోజుల రిమాండ్ విధించింది. అలానే చంద్రబాబు తరుపు న్యాయవాదులు హౌస్ కస్టడీ పిటిషన్ వేయగా..దానిని కోర్టు రిజెక్ట్ చేసింది. ఈక్రమంలోనే చంద్రబాబు గత రెండు రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నాడు. మంగళవారం ములాఖత్ ద్వారా నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి.. చంద్రబాబును కలిశారు. అనంతరం జైలు బయట వాళ్లు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ..” తెలుగు దేశం పార్టీ నందరమూరి తారక రామరావు నిర్మించారు. అటువంటి పార్టీ ఎటూపోదు. ఈ కుటుంబం ఎప్పుడూ ప్రజల కోసం, పార్టీ కేడర్ కోసం పోరాడి నిలుస్తోంది. అది మా కుటుంబం తరుపు నుంచి నేను హామి ఇస్తున్నాను. మీ స్వేచ్ఛ కోసం, మీ హక్కు కోసం పోరాడే మనిషి కోసం మీరు పోరాడాలి. ఆయనకు మద్దతుగా నిలవాలి. ఇది ఫ్యామిలీ, పార్టీకి చాలా టఫ్ టైమ్” అని భువనేశ్వరి అన్నారు.
అయితే ఆమె మాట్లాడిన తీరుపై రాజకీయ విశ్లేషకులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వరి గారి మాటల్లో బేలతనం, కొడుకు భవిష్యత్ పై బెంగ పడుతున్నట్లు కనిపిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు కోసం కేడర్ ను పోరాడమని చెప్పడం.. ఆమెకు పార్టీ కేటర్ పై నమ్మకం లేదని వాదనలు వినిపిస్తోన్నాయి. ఇక చంద్రబాబు ఇప్పట్లో బయటకి రాడనే ఆలోచన ఆమె కలిగిందని, ఈ నేపథ్యంలో లోకేశ్ పరిస్థితి ఎంటనే భయం ఆమెకు పట్టుకుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసింది..మొదలు.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లే వరకు.. ఎక్కడ అనుకున్న స్థాయిలో టీడీపీ కేడర్ నుంచి నిరసనలు కనిపించలేదు.
చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోంది..జైల్లో కూడా ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు- నారా భువనేశ్వరి#NaraBhuvaneshwari #NaraLokesh #narabrahmani #TDP #RajahmundryCentralJail #AndhraPradesh #CMYSJagan #ChandrababuNaidu #ChandrababuArrest #ChandrababuNaiduArrested #CBNArrested… pic.twitter.com/PwDOfAG7kW
— NTV Telugu (@NtvTeluguLive) September 12, 2023
అంతేకాక స్కిల్ డెవలప్మెంట్ స్కాం తో పాటు.. మరికొన్ని స్కాంలను అధికారులు వెలికి తీస్తున్నారు. వాటిలో కూడా చంద్రబాబును విచారించేందుకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పరిణామాలు అన్ని గమనించిన నారా భువనేశ్వరిలో ఓ నిరాశ అనేది ఏర్పడిందని, నమ్ముకున్న కేడర్ ఏమి చేయలేదనే భావనలో ఆమె ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి… చంద్రబాబు అరెస్ట్ తరువాత జరుగుతున్న పరిణామలపై భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.