iDreamPost
android-app
ios-app

ఆయన ప్రాణాలుతీసిన వాళ్లే వారసులుగా చలామణి అవుతున్నారు: లక్ష్మీ పార్వతి

ఆయన ప్రాణాలుతీసిన వాళ్లే వారసులుగా చలామణి  అవుతున్నారు: లక్ష్మీ పార్వతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. యన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ఫోటోతో కూడిన రూ.100 నాణేలను విడుదల చేశారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యన్టీఆర్ ఫోటోతో కూడిన రూ.100 నాణేలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి యన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. జూనియర్ యన్టీఆర్, కల్యాణ్ రామ్, లక్ష్మీపార్వతిలు మాత్రం హాజరు కాలేదు. అయితే తనకు ఆహ్వానం అందకపోవడం నందమూరి లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రికి సైతం లేఖ రాశారు. ఇవాళ  జరిగిన ఎన్టీఆర్ కార్యక్రమంపై  తాజాగా ఆమె అసంతృప్తి లేఖను విడుదల చేశారు. అంతేకాక యన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. యన్టీఆర్  పేరుతో రూ.100 నాణేం విడుదల చేయడం సంతోషంగా ఉందని, కానీ తనకు ఆహ్వానం అందించకపోవడం, పిలవకపోవడం బాధగా ఉందన్నారు. ఆయన ప్రాణాలు తీసిన వాళ్లు వారసులుగా చలామణి అవుతున్నారని, భార్యగా నాణెం అందుకోవడానికి తనకే ఆర్హత ఉందని ఆమె  అన్నారు. ఇక నుంచి తన పోరాటం పురందేశ్వరిపైనే అంటూ లక్ష్మీ పార్వతి ప్రకటించారు. యన్టీఆర్ అర్ధాంగిగా తనను ఆహ్వానించక పోవడం ఎంతో దుర్మార్గమని, తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులా కుటుంబ సభ్యులుగా చెలామణీ అవుతారా? అని ప్రశ్నించింది. పురంధేశ్వరి, భువనేశ్వరులే దుర్మార్గులు. యన్టీఆర్ కొడుకులు అమాయకులు. పురంధేశ్వరి చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తోందని లక్ష్మీ పార్వతి  అన్నారు. ఇక నుంచి పురంధేశ్వరి  తిరిగిన ప్రతి నియోజకవర్గంలో తిరుగుతాను, వీళ్ల గురించి ఎన్టీఆర్  ఏమన్నారో ప్రజలకు వివరిస్తాను అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నాళ్లు వీళ్ల నుంచి  అవమానాలు ఎదుర్కొంటూ ఉండాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ..” యన్టీఆర్ ను చంద్రబాబు బయటకి వెన్నుపోటుకు అంతర్గతంగా పురంధరేశ్వరే ప్రధాన కారకురాలు.  ఆమెను రాజకీయాల్లోకి వద్దని  యన్టీర్ అన్నందుకే కుట్ర చేసింది. తండ్రిపై కోపంతోనే కాంగ్రెస్ లోకి వెళ్లింది.  నా భర్త కార్యక్రమానికి నన్ను పిలవకుండా పురంధరేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారు. యన్టీఆర్ భార్యను అని మెడలో బోర్డు పెట్టుకుని తిరాగాల?. ఇంతకాలం యన్టీఆర్ కుటుంబంపై  అభిమానంతో మౌనంగా ఉన్నాను. ఇకపై కుటుంబాన్ని వదిలిపెట్టను. చంద్రబాబు, పురంధరేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతా. వచ్చే ఎన్నికల తరువాత వీళఅలు రాజకీయాల్లో  ఉండకుండా చేస్తా” అంటూ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. మరి.. లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రబాబుని కలవడం Jr. NTR కి ఇష్టం లేదా? తేల్చి చెప్పినట్టేనా?