బీచ్‌లోకి కొట్టుకొచ్చిన భారీ చెక్క పెట్టె.. ఏకాలం నాటిదంటే!

సాధారణంగా బీచ్ సమీపంలో కొన్ని చిత్ర విచిత్రమైన వస్తువులు కొట్టుకొని వస్తుంటాయి. జాలర్ల వలలో అప్పుడప్పుడు వింత వస్తువులు చిక్కుతుంటాయి. కొన్నిసార్లు పురాతన వస్తువులు కొట్టుకు రావడంతో అధికారులు వాటిని స్వాధీనపర్చుకుంటారు. తాజాగా విశాఖ పట్నంలోని వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ విచిత్రమైన వస్తువు కొట్టుకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నం బీచ్ లో ఇప్పటి వరకు ఎన్నో రకాల వస్తువులు తీరానికి కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క ఒకటి కొట్టుకు వచ్చింది. శుక్రవారం రాత్రి కొంతమంది పర్యాటకులు, మత్స్యకారులు ఈ పెట్టెను గమనించారు. ఆ చెక్కపెట్టె చూడటానికి పాతకాలానికి చెందినదిగా కనిపిస్తుంది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రొక్లెయినర్ సహాయంతో దాన్ని బయటకు తీశారు.

పోలీసులు ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ అధికారులకు సమాచారం అందించారు. భారీగా ఉన్న చెక్కపెట్టె బ్రిటీష్ కాలం నాటిది అని అంచనా వేస్తున్నారు. ఇక ఆ పెట్ట బరువు వంద టన్నుల వరకు ఉండవొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో ఏముంది అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక పురతన కాలం నాటి చెక్క పెట్టెను చూడటానికి సందర్శకులు ఎగబడుతున్నారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు చాలా శ్రమపడాల్సి వచ్చింది. గతంలో కూడా ఎన్నో రకాల వస్తువులు తీరానికి కొట్టుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పెట్టెలో ఏం ఉండవొచ్చు అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Show comments