iDreamPost
android-app
ios-app

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి పనికి రాని వ్యక్తి: MPకేశినేని నాని

Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏపీకి పనికి రాని వ్యక్తి అని నాని పేర్కొన్నారు.

Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏపీకి పనికి రాని వ్యక్తి అని నాని పేర్కొన్నారు.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి పనికి రాని వ్యక్తి: MPకేశినేని నాని

ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల్లో చేరికలు, అసమ్మత్తి స్వరాలు వినిపిస్తోన్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఏపీ రాజకీయాల్లో ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ లో విజయవాడ ఎంపీ కేశినేని నాని.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సీఎం జగన్ కి శాలువ కప్పిన నాని.. పుష్పగుచ్చం అందజేశారు. సీఎం జగన్ ను కలిసి అనంతరం మీడియాతో కేశినేని నాని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ప్రశంస వర్షం కురిపించారు. ఆయన పేదల పక్షపాతి అని, ఆయన పథకాలు తనను చాలా ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబుపై నాని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని  మాట్లాడుతూ..”టీడీపీ కోసం తాను ఎంతో కష్టపడి పని చేశాను. పార్టీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలా మంది చెప్పారు. అయినా కూడా నేను అవేమి పట్టించుకోకుండా నేను టీడీపీలోనే కొనసాగాను. నేను పార్టీ కోసం అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లు. కానీ చంద్రబాబు నా కుటుంబంలో చిచ్చు పెట్టారు.  నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేశ్ ఎందుకు చూశాడు. చంద్రబాబు మోసగాడని అందరికి తెలుసు. కానీ, కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టి.. మరీ ఇంత పచ్చి మోసగాడని, దగా చేస్తాడని తెలీదు. ఎంపీగా సీఎం కార్యక్రమాలకు నేను అటెండ్ కావాలి అది ప్రోటోకాల్. అయితే  నా విషయంలో టీడీపీ అది మర్చిపోయింది. నన్ను హాజరు కానివ్వలేదు. అసలు చంద్రబాబు ఏపీకి పనికి రాని వ్యక్తి” అని కేశినేని నాని బాబుపై ఫైర్ అయ్యారు.

ఇంకా కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ” 2014 నుంచి 2019 వరకు విజయవాడ కోసం చంద్రబాబు రూ.100కోట్లైనా ఇచ్చారా?. విజయవాడ కోసం నేను చేశాను. షాజహాన్ తాజ్ మహాల్ కట్టినట్లు తాను అమరావతి కడతానని బాబు గొప్పలు చేశారు. విజయవాడ అనేది రియాల్టీ, అమరావతి ఒక కల. ఇక ఎంపీ టికెట్ విషయంలో నేను ఎప్పుడు బాబును అడగలేదు. ఇప్పుడు సీఎం జగన్ ను కూడా అడగను. ఇప్పుడు సీఎం జగన్ తో ప్రయాణం చేయాలనుకుంటున్నా. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీని 60శాతం ఖాళీ చేస్తాను” అని నాని పేర్కొన్నారు.  ఇదే సమయంలో లోకేశ్ గురించి కూడా కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ కి పాదయాత్ర చేసే అర్హత ఉందా అని కేశినేని ప్రశ్నించారు. నా కుటుంబం సభ్యులతో కొట్టించాలని లోకేశ్ ఎందుకు చూశాడు. చంద్రబాబు ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పా.. కానీ, ఆయన వెళ్లొద్దని, నువ్వు ఉండాల్సిందేనని చెప్పారని నాని తెలిపారు. మరి.. చంద్రబాబుపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో  తెలియజేయండి.