Arjun Suravaram
Kesineni Nani: విజయవాడ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత కేశినేని నాని..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. తిరువూరులో జరిగిన ఓ సభలో పాల్గొన్న నాని.. ఈ సవాల్ చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..
Kesineni Nani: విజయవాడ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత కేశినేని నాని..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. తిరువూరులో జరిగిన ఓ సభలో పాల్గొన్న నాని.. ఈ సవాల్ చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..
Arjun Suravaram
ఏపీలో అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆదివారం రాప్తాడులో జరిగిన సిద్ధం సభ నుంచి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సింహనాందంతో ప్రసంగించారు. అంతేకాక చంద్రబాబు చేసిన ఒక్క మంచి పథకమైన ఉంటే చెప్పమంటూ సీఎం జగన్ సవాల్ విసిరారు. దీంతో స్పందించిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని, జగన్ మోహన్ రెడ్డి సిద్ధామా అంటూ ప్రతిసవాల్ విసిరారు. తాజాగా చంద్రబాబుకు వ్యాఖ్యలకు విజయవాడ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, చంద్రబాబు సిద్దమా అంటూ సవాల్ చేశారు.
సోమవారం తిరువూరు నియోజవర్గంలోనే నిర్వహించిన ఓ సభలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఆయనతో పాటు తిరువూరు వైఎస్సార్ సీపీ నియోజవర్గ ఇన్ ఛార్జీ స్వామిదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరువూరులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధిపై పలు విషయాలను నాని వెల్లడించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు కేశినేని నాని సవాల్ చేశారు. రాష్ట్రాభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, చంద్రబాబు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తరపున తాను చర్చకు సిద్దమని నాని తెలిపారు. అమరావతి లో ఒక సచివాలయం కడితేనే అభివృద్ధా, గ్రామానికి, రెండు వేల మంది ప్రజలకు ఒక సచివాలయం కట్టడం అభివృద్దా అంటూ ప్రశ్నించాడు. ఐదేళ్లలో అమరావతి రాజధానిని నిర్మిస్తాను అన్నావు, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం అన్నావు.. అన్నిటిని టెంపరరీ చేశావు. ఐదు కోట్ల మందికి ఒక్క సచివాలాయం కట్టడం అభివృద్ధా,10వేలా సచివాలయాలు నిర్మించడం అభివృద్ధా అంటూ చంద్రబాబుకు సూటీ ప్రశ్న వేశారు.
ఇంకా కేశినేని నాని మాట్లాడుతూ..” నువ్వు నీ కుటుంబం సంపదను దోచుకోవడం అభివృద్ధా చంద్రబాబు, ప్రజల కోసం నేరుగా వారికి ఖాతాల్లో డబ్బులు చేయడం అభివృద్ధి అంటారా?. చంద్రబాబు ప్రతిసారి తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. అభివృద్ధి అంటే అదేనా.. రాష్ట్ర అభివృద్ధిపైనా చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం, జగన్ మోహన్ రెడ్డి అవసరం లేదు. ఈనాడు పేపర్ మా చేతిలో ఉందని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఆనాడు ముఖ్యమంత్రిని బెదిరించి, పేదలను భయపెట్టి 2 వేల ఎకరాల ఆక్రమించి..అక్కడ పెద్ద కోటను నిర్మించుకున్నాడు.
ఆయన కోటలో జరిగిన అభివృద్ధి ముందు మన అభివృద్ధి కనబడదు. రామోజీ రావు కళ్లకు చంద్రబాబు చేసినదే అభివృద్ధిలా కనపబడుతుంది. నిజమైన అభివృద్ధి పల్లెల్లో ఉంది. నిజమైన అభివృద్ది ప్రజల్లో కనిపిస్తోంది. ఇది సీఎం జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమైంది. ఇవన్ని చూసి కూడా చంద్రబాబు అభివృద్ధి చేశానంటే నమ్మేవారు లేరు. టీడీపీ ఈనాడు చేతిలో ఉంది. రామోజీ 2000 ఎకరాల కోటలో నుంచి ఆంధ్రాను చూస్తాడు. చంద్రబాబు, ఆయన బినామీలు దోచుకోవడం అభివృద్ధా?” అంటూ కేశినేని నాని ప్రశ్నించాడు. మరి.. చంద్రబాబుపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.