iDreamPost
android-app
ios-app

మల్టీ‌ప్లెక్స్‌లో బూజు పట్టిన సమోసా.. కౌంటర్‌లో నిలదీస్తే..

గతంలో సినిమా థియేటర్లకు వెళితే.. మంచి నీళ్ల బాటిల్, కొన్ని వండిన పదార్థాలు తీసుకుని వెళ్లేవారు. లేకుంటే.. ఇంటర్వెల్ సమయంలో పాప్ కార్న్, ఐస్ క్రీమ్, చిప్స్ తక్కువ ధరకే కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు మల్టీ‌ప్లెక్స్‌ వచ్చేశాయి. ఇక వారి ఇష్టా రాజ్యం అయిపోయింది.

గతంలో సినిమా థియేటర్లకు వెళితే.. మంచి నీళ్ల బాటిల్, కొన్ని వండిన పదార్థాలు తీసుకుని వెళ్లేవారు. లేకుంటే.. ఇంటర్వెల్ సమయంలో పాప్ కార్న్, ఐస్ క్రీమ్, చిప్స్ తక్కువ ధరకే కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు మల్టీ‌ప్లెక్స్‌ వచ్చేశాయి. ఇక వారి ఇష్టా రాజ్యం అయిపోయింది.

మల్టీ‌ప్లెక్స్‌లో బూజు పట్టిన సమోసా.. కౌంటర్‌లో నిలదీస్తే..

వినోదం కోసం సినిమాల హాల్స్‌కు వెళుతూ ఉంటారు. మూవీని ఎంజాయ్ చేయడంతో పాటు ఇంటర్వెల్‌లో అమ్మనాన్నలతో ఏదైనా కొనిపించుకోవచ్చునని పిల్లలు కూడా సరదా పడుతుంటారు. ఇటీవల మల్టీ ప్లెక్స్ థియేటర్లు రావడంతో.. వీకెండ్స్, ఫెస్టివల్స్ సమయాల్లో సకుటుంబ సపరివార సమేతంగా వెళుతుంటారు. టికెట్ రేటు కన్నా.. బ్రేక్‌లో తినే పాప్ కార్న్, సమోసా, చిప్స్ రేట్లు ఎక్కువని తెలిసినప్పటికీ.. పిల్లల కోసం, వేరో ఆప్షన్ లేక వాటిని కొంటుంటారు పేరేంట్స్. చెప్పాలంటే.. సినిమా ముసుగులో ఓ చిన్న దందా నడుస్తూ ఉంటుంది. పోనీ అంత ఖర్చు పెట్టి నాణ్యతమైన ఫుడ్ అందిస్తున్నాయంటే.. పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా వ్యహరిస్తున్నాయి.

విజయవాడలోని ఓ మల్టీ‌ప్లెక్స్‌లో ఇటువంటి లొటారమే బయటకు వచ్చింది. బందర్ రోడ్డులోని పటమటలోని మల్టీ‌ప్లెక్స్‌లో మూవీ చూసేందుకు సోమవారం సాయంత్రం వెళ్లారో మహిళ. ఇంటర్వెల్‌లో ఆమె సమోసాలు కొనగా.. అవి బూజు పట్టాయి. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. మల్లీ ప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌లో సమోసా కొన్నారు. తింటుండగా.. కుళ్లిన వాసన వచ్చింది. సమోసాను తుంపి చూస్తే.. బూజు పట్టినట్లు కనిపించింది. వెంటనే ఆ స్టాల్ కౌంటర్ వద్దకు వెళ్లి ఏంటి ఇదని, సమోసాను చూపించగా.. నిర్వాహకులు పట్టించుకోలేదు. ఆ మొత్తం ఘటనను వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో బయటకు వచ్చింది.

కుళ్లిన సమోసా విషయంలో తాను నిలదీసినందుకు.. థియేటర్‌లో పడిపోయిన తన బైక్, ఇంటి తాళాలు కూడా తీసుకునేందుకు లోపలికి అనుమతించలేదని ఆరోపించారు.. ఆ మహిళ. దీనిపై థియేటర్ మేనేజ్ మెంట్ స్పందించింది. సమోసాలు బాగోక పోతే.. వేరేమి ఇస్తామని, లేదంటే డబ్బులు రిఫండ్ చేస్తామని, కానీ ఆమె వినిపించుకోకుండా.. దుర్భాషలాడుతున్నారని పేర్కొంది. కాసేపు ఆగి వచ్చాక.. తన స్కూటీ, ఇంటి కీస్ ఇక్కడే పడ్డాయని, మీరే తీశారంటూ గొడవ చేశారని, దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. థియేటర్ మొత్తం వెతికినా ఆమె చెప్పిన తాళాలు కనిపించలేదని వెల్లడించింది. మహిళా వీడియోలు తీస్తూ వీక్షకులను ఇబ్బందికి గురి చేస్తుందన్న మల్టీ ప్లెక్స్ మేనేజ్ మెంట్ ఫిర్యాదుతో అక్కడకు వెళ్లామని, ఆమెను ఫిర్యాదు చేయమని కోరగా.. స్టేషన్ వరకు వచ్చారని, మళ్లీ వచ్చి ఫిర్యాదు చేస్తామని వెళ్లిపోయినట్లు పటమట పోలీసులు తెలిపారు.