iDreamPost
android-app
ios-app

YSRCP కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే..!

  • Published Mar 01, 2024 | 7:29 PM Updated Updated Mar 01, 2024 | 7:29 PM

MLA Attended The Funeral YSRCP Activist: వైయస్సార్సీపి కార్యకర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.. ఆయన అంత్యక్రియలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే పాడె మోశారు.

MLA Attended The Funeral YSRCP Activist: వైయస్సార్సీపి కార్యకర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.. ఆయన అంత్యక్రియలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే పాడె మోశారు.

YSRCP కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే..!

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతోమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. తమ వాళ్లను కోల్పోయి ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం కొన్నిసార్లు ప్రకృతి వైపరిత్యాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలు అమలు పరుస్తున్నాయి. అయినా కూడా ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో వైసీపీ కార్యకర్త కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

అన్నమయ్య జిల్లా రాయచోటి-గాలివీడు రహదారి పై ట్రాక్టర్ ను బైక్ అదుపు తప్పి ఢీ కొట్టిన ఘటనలో వైయస్సార్సీపి కార్యకర్త, సోషల్ మీడియా అన్నమయ్య జిల్లా కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. భరత్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం కోసం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి భరత్ కుమార్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. శుక్రవారం జరిగిన అంత్యక్రియలో ఎంఎల్‌ఏ శ్రీకాంత్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పర్సన్ జకియా ఖానం పలువురు వైసీపీ నాయకులు వాలంటీర్లుగా పాల్గొని భరత్ కు తుది వీడ్కొలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.. భరత్ కుమార్ రెడ్డి పాడె మోశారు.

ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా భరత్ కుమార్ రెడ్డి ఎంతో చురుగ్గా వ్యవహరించేవారు. వైసీపీ కి ఏనలేని సేవలు చేస్తూ అందరితో కలివిడిగా ఉండేవాడు.. చిన్న వయసులోనే దేవుడు ఇలా చేస్తాడనుకోలేదు. భరత్ కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. అతని కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాం. భరత్ లేడన్న వార్త తల్చుకుంటే ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. రోడ్డు ప్రయాణాలు చేసేటపుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. భరత్ మృతిపట్ల ఎంపీ మిథున్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులో కన్నుమూయడం చాలా విచారకరం అన్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.