iDreamPost
android-app
ios-app

సీఎం జగన్ ను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే RK!

Alla Ramakrishna Reddy, YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నాయకులు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సొంతగూటికి వెళ్లనున్నారు.

Alla Ramakrishna Reddy, YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నాయకులు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సొంతగూటికి వెళ్లనున్నారు.

సీఎం జగన్ ను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే RK!

ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. సీనియర్ నాయకులు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సొంతగూటికి చేరుతున్నారు. కొంతకాలం క్రితం రామకృష్ణారెడ్డి  వైఎస్సార్ సీపీ పార్టీని వీడి.. కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన రామకృష్ణారెడ్డి సీఎం జగన్ ను కలిశారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను ఆర్కే కలిశారు. అలానే సీఎం జగన్..మంగళగిరి నియోజవర్గ వైసీపీ గెలుపు బాధ్యతలను  రామకృష్ణారెడ్డికి అప్పగించున్నారు. ఆర్కే రాకతో స్థానిక వైసీపీ కేడర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకు వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల్లో ఆయన ఒకరు. అంతేకాక వైఎస్సార్ ఫ్యామిలీకి వీరాభిమాని. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన వెంటనే నడిచారు. 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో మాజీ మంత్రి నారా లోకేశ్ పై ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల వేళ ఆర్కే మంత్రి పదవి ఇస్తానని స్వయంగా వైఎస్ జగన్ ప్రకటించారు. పార్టీ ఆధికారంలోకి వచ్చిన తరువాత  ఆయనకు పదవి దక్కలేదు. మంత్రివర్గంలో జరిగిన మర్పుల తరువాత అయినా ఆయనకు కేబినెట్ లో స్థానం లభిస్తోందని ఆశించారు. అది కూడా జరగలేదు. అంతేకాక ఇటీవల ఆయన్ను తప్పించి మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ బాధ్యతల్ని..గంజి చిరంజీవికి అప్పగించారు. కొద్దిరోజులకే ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు.

అనంతరం షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతే కాదు కాంగ్రెస్ లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా చాలా సులువుగా వైసీపీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు. అయితే అక్కడ ఎక్కువ కాలం ఇమడ లేకపోయినట్లు సమాచారం. దీంతో మళ్లీ కొద్దిరోజులకే యూ టర్న్ తీసుకున్నారు. మంగళగిరి నియోజవర్గంలో ఇన్నాళ్లూ తనను నమ్ముకుని ఉన్న వర్గం నేతలంతా పెంచుతున్న ఒత్తిడితో తిరిగి సొంత గూటికి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం జగన్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. ఇక ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మంగళ గిరి నియోజకవర్గ ఇన్ ఛార్జీ గంజి చిరంజీవి కూడా సీఎంవోకు వెళ్లారు.