iDreamPost
android-app
ios-app

సీఎం జగన్ కి రాఖీ కట్టిన మంత్రి విడదల రజిని..

సీఎం జగన్ కి రాఖీ కట్టిన మంత్రి  విడదల రజిని..

అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతి రూపంగా జరిగే పండుగ రాఖీ.  అయితే అందుకే ప్రతి సోదరి.. తన సోదరుడికి, తన సోదరుడిలా భావించే వ్యక్తులకు రాఖీ కడుతుంది.  అంతేకాక  రాఖీ కట్టినందుకు తమ సోదరిమణులకు వివిధ రకాల గిఫ్ట్ లు ఇస్తుంటారు. ఈ పండగ సందర్భంగా ప్రముఖులు సైతం తమ సోదరులకు రాఖీలు కట్టారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రాఖీ పండగను జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని రాఖీ కట్టింది.  ఇటీవలే నగరిలో జరిగిన కార్యక్రమంలో  మంత్రి ఆర్కే రోజా.. సీఎం జగన్ కి రాఖీ కట్టిన సంగతి తెలిసింది.

రాఖీ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి.. మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ బుధవారం ట్వీట్ చేశారు. అక్కచెల్లెమ్మలు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడినని ఆయన తెలిపారు. మహిళ సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా, వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని  సీఎం తెలిపారు.

ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడు అక్కచెల్లమ్మలకు అండగా ఉంటాని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాఖీ సందర్భంగా సీఎం జగన్ ని కలిసిన మంత్రి విడదల రజనీ.. ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం ఆయన నుదిటికి తిలకం పెట్టి.. స్వీట్ తినిపించారు.  అనంతరం ఆయన కాళ్లకు నమష్కరించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం జగన్ కూడా మంత్రి రజనీ ఆశీర్వదించి.. స్వీట్ తినిపించారు. మరి. ఈ అపూర్వ దృశ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş