P Venkatesh
P Venkatesh
స్కిల్ డెవలప్ మెట్ పేరిట కుంభకోణానికి తెరలేపి వందల కోట్ల అవినితికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు బాబే అని సీఐడీ తేల్చింది. దీంతో ముందు నుంచి ఏదైతే జరగకూడదని టీడీపీ శ్రేణులు భావించాయో అదే జరిగి బాబు అరెస్టు కావడంతో బాబు అనుచరలు తీవ్ర నిరాశ, నిసృహలకు లోనవుతున్నారు. ఓ పక్క అరెస్టు మరో పక్క ప్రజల నుంచి మద్దతు లభించకపోవడంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. బాబు అరెస్టును ప్రజలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ బంద్ కు కూడా టీడీపీ పిలుపినిచ్చింది. కానీ బంద్ కు ప్రజలు మద్దతివ్వలేదు. ఈ క్రమంలో మంత్రి కారుమూరి నాగేశ్వరావు టీడీపీ బంద్ పై సెటైర్స్ వేశారు.
చంద్రబాబు అరెస్టు అనంతరం రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూసిన టీడీపీకి ఏపీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. బంద్ పేరుతో విధ్యంసానికి తెరలేపాలని ప్రయత్నించిన బాబు అనుచరులకు బంద్ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు.ఇక దీనిపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సందించారు. టీడీపీ బంద్ ప్రకటించి కనీసం బాబు సంస్థ అయినటువంటి హెరిటేజ్ ను అయిన మూసివేయాల్సిందని ఆయన ఎద్దేవా చేశారు.
హెరిటేజ్ ను మూయకపోవడంతో ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. అవినీతి కేసులో అరెస్టు అయిన బాబును పట్టించుకోకుండా ప్రజలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారని కారుమూరి అన్నారు. ప్రజలు సానుభూతి కూడా చూపించలేదని అన్నారు. బాబు అవినీతి పరుడు కాదని ఆయన పుత్ర రత్నం నారా లోకేష్ కూడా చెప్పలేడని, ఎన్టీఆర్ కుటుంబం కూడా బాబు అరెస్టుపై స్పందించకుండా మౌనంగా ఉంటున్నారంటే బాబు ఎంతటి అవినీతి పరుడో తెలుస్తుందని మంత్రి కారుమూరి అన్నారు.