iDreamPost

బాబుకు మరో షాక్‌.. హౌస్‌ కస్టడీకి నో చెప్పిన ACB కోర్టు!

బాబుకు మరో షాక్‌.. హౌస్‌ కస్టడీకి నో చెప్పిన ACB కోర్టు!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమెన్స్‌ స్కాం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఏపీ సీఐడీ అధికారులు శనివారం ఆయన్ని నంద్యాలలో అరెస్ట్‌ చేశారు. ఆదివారం ఆయన్ని కోర్టులో హాజరపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆదివారం నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే ఉంటున్నారు. చంద్రబాబును రాజమండ్రి జైల్లో కాకుండా ఇంట్లోనే ఉంచి ఆయన్ని విచారించేందుకు గానూ..

హౌస్‌ కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పెషల్‌ జీపీ వివేకాదనంద వాదనలు వినిపించారు. భద్రతా కారణాల దృష్ట్యా చంద్రబాబు హౌస్‌ కస్టడీకి ఇవ్వాలని లూథ్రా కోరగా.. ఇంటికంటే జైలులోనే ఆయనకు ఎక్కువ రక్షణ ఉంటుందని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు.

ఏసీబీ కోర్టు దాదాపు రెండు రోజులు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ సాయంత్రం తుది తీర్పును ఇచ్చింది. సీఐడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది. చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి