iDreamPost
android-app
ios-app

CM జగన్ కేబినెట్ నుంచి ఆ మంత్రి బర్తరఫ్..

నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 2014 నుంచి 2019 వరకు ఇప్పడటి వరకు ఎప్పుడు జరగని ఓ అరుదైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు మాత్రమే జరిగాయి. కానీ తొలిసారి ఓ మంత్రిని కెేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు.

నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 2014 నుంచి 2019 వరకు ఇప్పడటి వరకు ఎప్పుడు జరగని ఓ అరుదైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు మాత్రమే జరిగాయి. కానీ తొలిసారి ఓ మంత్రిని కెేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు.

CM జగన్ కేబినెట్ నుంచి ఆ మంత్రి బర్తరఫ్..

కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తొలిసారి ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగడం అనేది ప్రథమం. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. అలానే 2019 వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రెండు  ప్రభుత్వాల పూర్తి కాలంలో ఎప్పుడూ జరగని ఘటన మంగళవారం చోటుచేసుకుంది. 2014 నుంచి నేటి వరకు ఏపీ మంత్రి వర్గంలో మార్పులు జరిగాయే తప్ప.. ఎవరిని బర్తరఫ్ చేయలేదు. అయితే మంగళవారం ఓ మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంత్రిగా పని చేస్తున్నారు. సీఎం జగన్ కేబినెట్ లో మార్చుకుండా ఉంచిన మంత్రులు ఈయన ఒకరు. కార్మిక శాఖ మంత్రిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రకటనలో ఆలూరు నుంచి ఆయనను తప్పించి..కర్నూలు ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. దీంతో వైసీపీ అధిష్టానంపై తీవ్ర అలకతో ఉన్నారు. ఎవరికి ఇవ్వని అవకాశం పూర్తికాలం మంత్రి వర్గంలో ఉంచారనే విషయం మర్చిపోయినా గుమ్మనూరి జయరాం..మంగళవారం టీడీపీలో చేరారు.

పార్టీని ఫిరాయించడంతో మంత్రి గుమ్మనూరి జయరాం ను రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారాయన. తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే  గుమ్మనూరు మంగళగిరిలో జరిగిన టీడీపీ సభ సమయంలో ఆ పార్టీలో చేరడం గమనార్హం.  దీంతో వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. సదరు మంత్రిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని  గవర్నర్ కి సిఫారసు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు. దీంతో రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన తొలి మంత్రిగా గుమ్మనూరి జయరాం నిలుస్తాడు. అయితే గుమ్మనూరి జయరాం చేసిన పనికి వైఎస్సార్ సీపీ నేతలు, ఆలూరి నియోజవర్గ వైస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సీఎం జగన్ మోహన్ రెడ్డి నమ్మకంతో ఐదేళ్లు మంత్రివర్గంలో ఉంచితే.. ఆ విశ్వాసం మర్చి..పార్టీ ఫిరాయించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. గుమ్మనూరు జయరాం అవినీతి పరుడంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గుమ్మనూరు చేరికను మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జయరాం ఇచ్చే డబ్బు కు ఆశ పడి చంద్రబాబు ఆయన్ని టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యమని, రాబోయే ఎన్నికల్లో గుమ్మనూరుకు సహకరించేది లేదంటూ గుంతకల్లు టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.