iDreamPost
android-app
ios-app

ఏపీకి పట్టిన శని చంద్రబాబు.. మంత్రి అంబటి సంచలన కామెంట్స్!

ఏపీకి పట్టిన శని చంద్రబాబు.. మంత్రి అంబటి సంచలన కామెంట్స్!

ఏపీలో రాజకీయాలు మంచి హీట్ పుట్టిస్తున్నాయి. మిగత రాష్ట్రాలు కూడా ఏపీని చూసి నేర్చుకునేలా ఏపీ రాజకీయం నడుస్తోంది. అధికార వైసీపీపై ప్రతిపక్ష జనసేనా, టీడీపీ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగానే అధికార పార్టీ నేతలు, మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన వైసీపీ, టీడీపీ ఘర్షణపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. రౌడి రాజ్యం నడుస్తుందంటూ టీడీపీ నేతలు విమర్శించారు. ఈ క్రమంలో చంద్రబాబుపై నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు అధికారంలో లేకుంటే హింసను కోరుకుంటారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడు జిల్లా వినుకొండలో రెండు రోజుల క్రితం వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారు ముందు టీడీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితులు అదుపులోకి తెచ్చారు. ఇక శుక్రవారం మంత్రి అంబటి రాంబాబు వినుకొండలో పర్యటించారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తాను అధికారంలో లేకపోతే రాష్ట్రమంతా హింస చెలరేగాలని కోరుకుంటారని, అది ఆయన నైజమని రాంబాబు అన్నారు.

వినుకొండలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాని ఆయన తెలిపారు. స్థానికులకు వాస్తవాలేంటో స్పష్టంగా తెలుసని, పోలీసులు గాలిలోకి కాల్పులు జరపకపోయి ఉంటే అక్కడ ఘోరంగా ఉండేదని ఆయన అన్నారు.  ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వల్లభ డెయిరీ ఫామ్ లోకి గోడలు దూకి మరీ వెళ్లి ఫోటోలు తీసి సెల్ఫీ ఛాలెంజ్ చేశారని,  ఎమ్మెల్యే ఫామ్ నిర్మాణం కోసం గోతులు తవ్వి, మట్టి బయటకు తీశారని, దీన్ని ఆసరాగా చేసుకుని మట్టిని వేరేచోటకు తరలిస్తున్నారంటూ జీవీ ఆంజనేయులు, టీడీపీ నేతలు యాగీ చేశారని మంత్రి ఫైర్ అయ్యారు.

ఇంకా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..” ఇటీవలే చంద్రబాబు టీవీ సీరియల్ లాగా పోలవరం, వ్యవసాయం, రాయలసీమ పరిస్థితులపై ఎల్లో మీడియాలో సుదీర్ఘ ప్రసంగాలు ప్రసారం చేస్తున్నారు. వ్యవసాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. పోలవరాన్ని రామోజీరావు బంధువైన నవయుగ కంపెనీకి ధారాదత్తం చేసి పోలవరాన్ని  ఏటీఎం లాగా వాడుకున్నారు.  14 ఏళ్లు ఏపీకు పట్టిన  చంద్రబాబు అనే శనిని వైఎస్ వదిలించారు. మరలా 2019లో  వైఎస్ జగన్ ఇంటికి పంపారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కరువు మండలం లేదు” అంటూ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మరి.. చంద్రబాబుపై మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  వర్షాలకు హైదరాబాద్ సిటీనే మునిగిపోయింది.. నువ్వో లెక్కా?: బొత్స సత్యనారాయణ

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş