iDreamPost
android-app
ios-app

చంద్రబాబు నాయుడి కంటే నల్లత్రాచు బెటర్: మంత్రి అంబటి

  • Published Jan 31, 2024 | 11:10 AM Updated Updated Jan 31, 2024 | 11:10 AM

Ambati Rambabu: ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. తరచూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలీలో సెటైర్లు వేస్తుంటారు. అవకాశం దొరికిన ప్రతిసారి చంద్రబాబుపై ఓ రేంజ్ లో పంచ్ లో వేస్తుంటారు. తాజాగా మరోసారి బాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు కుప్పించారు.

Ambati Rambabu: ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. తరచూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలీలో సెటైర్లు వేస్తుంటారు. అవకాశం దొరికిన ప్రతిసారి చంద్రబాబుపై ఓ రేంజ్ లో పంచ్ లో వేస్తుంటారు. తాజాగా మరోసారి బాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు కుప్పించారు.

  • Published Jan 31, 2024 | 11:10 AMUpdated Jan 31, 2024 | 11:10 AM
చంద్రబాబు నాయుడి కంటే నల్లత్రాచు బెటర్: మంత్రి అంబటి

ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలోకి వెళ్తోంది. పరస్పరం విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ ను సమ్మర్ హీట్ లా చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… అధికారంలోకి వస్తే.. ఏం చేస్తాను అనే విషయం చెప్పకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై  మంత్రులు, ఇతర వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు కంటే నల్లత్రాచు చాలా మేలంటూ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శళు, సెటైర్లు వేశారు. నాలుగున్నరేళ్లుగా తాను అందించిన సంక్షేమ పాలన గురించి సీఎం జగన్ చెబుతున్నారు. అలానే చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన వైఫల్యాలను కూడా సీఎం జగన్ ప్రజలు వివరించారు. సీఎం జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారని మంత్రి అంబటి తెలిపారు. బాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజాస్పందన లేకుండా పోయిందని, తాను ఇది చేశానని చెప్పుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరంటూ మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు పరిపాలనలో అంతా ఆయన వర్గం కోసమేనని, అయినా ప్రజల్ని మభ్యపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు మంత్రి తెలిపారు.

ambati rambabu shocking comments on chandra babu

ఇక మంత్రి అంబటి మాట్లాడుతూ…” చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే… నాకు ముక్కుతాడు వేస్తాడట. ఆయన అధికారంలోకి వచ్చేది లేదు. చచ్చేది లేదు. ఆంబోతులకు ఆవున్ని సప్లయ్ చేసిన చరిత్ర చంద్రబాబుది. బాబుకు ఇవే చివరి ఎన్నికలు, ఆయనకంటూ ఓ మంచి విజన్ లేదు. ఆయనకున్న విజన్.. అందితే జట్టు, అందకపోతే కాళ్లు. మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత బాబుది. చంద్రబాబుకు ఉన్నది విజన్ కాదు.. ఆయన ఒళ్లంతా విషమే. ఆయన కంటే నల్లత్రాచు చాలా మేలు” అంటూ మంత్రి రాంబాబు తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

ఇంకా మంత్రి మాట్లాడుతూ… కన్నా లక్ష్మీనారాయణ తనపై రాళ్ల దాడికి  నేనే కారణమని అంటున్నారు.  అంత అవసరం నాకు లేదు. ఆయనే సానుభూతి కోసం అలా చేస్తున్నారు. బాబు, కన్నా నన్ను టార్గెట్ గా చేశారు. అయినా నేను భయపడను. కోతికి కొబ్బరి చిప్పలా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దొరికింది. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయాక ఆమె తెలంగాణకు తిరిగి వెళ్లడం ఖాయం. ఏపీలో ఇల్లు లేని వాళ్లు  కూడా ఇక్కడ హడావుడి చేస్తున్నారు. ఎన్నికలయ్యాక వీరంతా హైదరాబాద్ వెళ్లిపోతారు” అని అంబటి స్పష్టం చేశారు. ఇక సీఎం జగన్ గురించి అంబటి మాట్లాడుతూ.. పేదల సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్ అని, కౌరవ సైన్యాన్ని ఓడించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అభిమన్యుడిలా ప్రతిపక్షాలు పన్నిన పద్మ వ్యూహాన్ని ఛేదించి వైఎస్ జగన్ తిరిగి సీఎం అవుతారని అంబటి ధీమా వ్యక్తం చేశారు. మరి చంద్రబాబు నాయుడిపై మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş