Uppula Naresh
Cyclone Michaung in AP: ఏపీకి మరో వర్షా సూచన రానుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా అక్కడక్కడ భాారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Cyclone Michaung in AP: ఏపీకి మరో వర్షా సూచన రానుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా అక్కడక్కడ భాారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Uppula Naresh
నవంబర్ లో బంగాళాఖాతంలో తుఫాను ముప్పు ఏర్పడుతుంది. దీని కారణంగా ఏపీలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ, ఆ ముప్పు తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది. దీనికి భాతర వాతావరణ విభాగం (ఐఎండీ) మిచౌంగ్ అనే పేరును సూచించారు. ఇది నెల్లూరు-బందరు మధ్య తీవ్ర తుఫానుగా మారి డిసెంబర్ 5న తీరం దాటుందని తెలిపారు. ఈ మిచౌంగ్ ప్రభావంతో గంటలకు 100 కి.మీ.కుపైగా వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఇంతే కాకుండా గంటకు 11. కి. మీ వేగంతో వాయువ్య దిశగా పయనిస్తుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక మిచౌంగ్ తుఫాను నెల్లూరుకు ఆగ్నేయంగా 350 కి.మీ., బాపట్లకు 250 కి.మీ., చెన్నైకు తూర్పు-ఆగ్నేయంగా 230 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాతో పాటు యానాంలో డిసెంబరు 4, 5 తేదీల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇంతే కాకుండా ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.