ఐఎండీ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు..

IMD Alert: ఈ మధ్య కాలంలో ఏపీ దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

IMD Alert: ఈ మధ్య కాలంలో ఏపీ దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తునే ఉన్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనాలు, ఆవర్తనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ,తమిళనాడు,కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏపీ దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా ఏపీకి మరో తుఫాన్ ముప్ప పొంచి ఉందని ఐఎండీ హెచ్చరిస్తుంది. ఈ నెల23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. 27 నాటికి తుఫాన్ గా బలపడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నెల28 లోపు చెన్నై, నెల్లూరు మద్య తుఫాన్ తీరం తాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల 24 నుంచి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27,28,29 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలో సైతం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కాస్తాయి. దక్షిణాది రాయలసీమలో మాత్రం పలు ప్రాంతాలు మేఘావృతమైన ఉంటాయని తెలిపింది. గాలి వేగం పెరి పొడి వాతావరణంగా ఉంటుంది. తెలంగాణలో సుమారు 11 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మధ్యనే బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ పలు ప్రాంతాల్లో బీభత్సవం సృష్టించింది. తుఫాన్ ప్రభావంతో ప్రజలు, రైతులు నానా అవస్థలు పడ్డారు. గత వారం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో పడింది. నెల్లూరు, సూళ్లూరుపేట, గూడురు, కావలి లో భారీ వర్షాలు పడటంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ తుఫాన్ గురించి మర్చిపోక ముందే మరో తుఫాన్ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో మళ్లీ భయం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వరి పంట చేతికి వచ్చే దశకు చేరుకుంది.

ఈ సమయంలో మళ్లీ తుఫాన్ అంటే తమ పరిస్థితి ఘోరంగా మారుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస తుఫాన్‌లతో తమ పరిస్థితి మరీ దారుణంగా మారిపోతుందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో వాతావరణం లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. అటు దక్షిణాది తెలంగాణలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రత ఏకంగా సింగిల్ డిజిట్ కి పడిపోయినట్లు తెలుస్తుంది. మరో వారం రోజుల పాటు పరిస్తితి ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి వేళలో తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని.. అందుకే రాత్రి ప్రజలు చలి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శీతాకాలం కావడం వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోస ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ అంటున్నారు డాక్టర్లు. వేడి నీరు, వేడి ఆహార పదార్ధాలు తినాలని రోగ నిరోదక శక్తి పెంచుకోవడానికి హెల్తీ ఫుడ్ తీసుకోవాలీని వైద్యులు సూచిస్తున్నారు.

Show comments