Nidhan
దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Nidhan
దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ కోసం యావత్ దేశం ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తోంది. ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుంది? ఎవరి జాతకం ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎన్నికల్లో ఎవరు నెగ్గారనే దానిపై రేపు మధ్యాహ్నంతో స్పష్టత రానుంది. ఎలక్షన్ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ఎన్నికల ఫలితం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో అందరికీ ఓ హెచ్చరిక. ఎన్నికల ఫలితాలపై అటువంటి పోస్టులు పెడితే అడ్డంగా బుక్కవుతారు.
ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు కామన్ అయిపోయింది. పార్టీలు, అభ్యర్థుల గెలుపోటములపై అభ్యంతకర పోస్టులు నెట్టింట దర్శనం ఇవ్వడం మామూలుగా మారింది. కౌంటింగ్ తర్వాత మీ లెక్క తేలుస్తామంటూ కొందరు ప్రత్యర్థి పార్టీలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అప్రమత్తమైంది ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ. ముఖ్యంగా సోషల్ మీడియాపై ఎక్కువ దృష్టి పెట్టింది. అందుకోసం స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించింది. రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు, ఫొటోలు వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో స్టేటస్లు, పోస్టులు పెట్టడం నిషేధమని తెలిపింది.
రెచ్చగొట్టే కామెంట్స్, వ్యక్తిగత దూషణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు పోస్టులు పెడుతున్నారు? ఎవరి అండతో ఈ పని చేస్తున్నారో విచారించి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, రౌడీషీట్ ఓపెన్ చేస్తామని అంటున్నారు. అవసరం పడితే పీడీ యాక్ట్‌లు కూడా ప్రయోగిస్తామని చెబుతున్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు అలర్ట్‌గా ఉండాలని ఏపీ కొత్త డీజీపీ హరీష్ గుప్తా స్పష్టం చేశారు. ఇక, కౌంటింగ్‌కు సంబంధించి ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ ఓ ప్రకటన చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు.