iDreamPost
android-app
ios-app

మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆ తేదీ వరకు మద్యం షాప్స్ బంద్!

మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆ తేదీ వరకు మద్యం షాప్స్ బంద్!

బాధైనా, సంతోషమైన ముందు గుర్తొచ్చేది మద్యమే. తమ సంతోషాలను బాధలను మద్యంతోనే సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో చుక్క పడనిదే పొద్దుగడవని మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ తెలిపారు అధికారులు. ఆ తేదీల్లో మద్యం షాప్స్, కల్లు దుకాణాలను బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఆ తేదీ వరకు మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. దీంతో మద్యం ప్రియులు ఉసూరుమంటున్నారు. అయితే గణేష్ నిమజ్జనం కారణంగానే మద్యం అమ్మకాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతకీ ఏ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్ కానున్నాయి? ఏ తేదీ వరకు అమ్మకాలు నిలిచిపోనున్నాయి? ఆ విషయాలు మీ కోసం..

ఏపీలోని కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్ కానున్నాయి. జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు జరిగే ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, వెల్దుర్తిలో ఈనెల 20వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం షాపులు క్లోజ్ చేయనున్నారు. ఆదోని, గూడూరులో 21వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు, కర్నూలులో 25వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల్లో అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.