శ్రావణ శుక్రవారం కావడంతో.. వేకువ జామునే లేచి తల్లితో కలిసి అమ్మవారి పూజ చేసింది కళ్యాణి. పూజలో భాగంగా చేసిన వివిధ రకాల ప్రసాదాలను చుట్టు పక్కలవారికి పంచిపెట్టింది. అమ్మవారికి పూజ చేసి ఇలా ప్రసాదం పంచిపెడుతూ.. లక్ష్మీదేవిలా కనిపించిన కుమార్తెను గంటల వ్యవధిలోనే అలా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు ఆ తల్లిదండ్రులు. కొన్ని క్షణాల ముందే తమ కళ్ల ముందు లక్ష్మీదేవిలా తిరిగిన కుమార్తె మరణించిందన వార్త ఆ తల్లిదండ్రులను గుండెలు పగిలేలా చేసింది. ఈ విషాద సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
శ్రీకాకులం జిల్లా పలాస మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఇప్పిలి బాలరాజు-పుణ్యావతి దంపతులకు ఓ కూతురు ఉంది. ఆమె పేరు కళ్యాణి. ప్రస్తుతం ఆమె కాశీబుగ్గ గాంధీనగర్ లో శ్రీకృష్ణా ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పని చేస్తోంది. అయితే శ్రావణ శుక్రవారం కావడంతో.. తెల్లవారుజామునే తల్లితో కలిసి లక్ష్మీవ్రతం ఆచరించింది. పూజలో భాగంగా చేసిన వివిధ రకాల ప్రసాదాలను చుట్టుపక్కల వారికి పంచిపెట్టింది. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి ఫోన్ రావడంతో.. తన స్కూటీపై బయలుదేరింది.
ఈ క్రమంలోనే సరియాపల్లి పెట్రోల్ బంకు దగ్గర కళ్యాణి స్కూటీని విశాఖ-ఇచ్చాపురం ఎక్స్ ప్రెస్ బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కళ్యాణి తలకు పెద్ద గాయం అయ్యింది. దాంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఘటన జరిగిన వెంటనే బస్ డ్రైవర్ పరార్ అయ్యాడు. కొన్ని క్షణాల ముందు వరకు లక్ష్మీదేవిలా కళ్ల ముందే తిరిగిన కూతురు.. ఇలా కానరాని లోకాలను వెళ్లడంతో.. తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ విషాద సంఘటన చూపరులకు కూడా కంటతడి తెప్పిస్తోంది.
ఇదికూడా చదవండి: BREAKING: రైల్లో పేలిన గ్యాస్ సిలిండర్! కళ్ల ముందే దారుణం!