వీడియో: భారీ వర్షాలు.. విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు

Vijayawada: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల ధాటికి ఏపీలోని విజయవాడలో భారీగా కొండచరియాలు విరిగిపడ్డాయి. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.

Vijayawada: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల ధాటికి ఏపీలోని విజయవాడలో భారీగా కొండచరియాలు విరిగిపడ్డాయి. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.

గత కొన్ని రోజులుగా దేశావ్యాప్తంగా కుండపోతు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ భారీ వర్షాలు ఎంతటి బీభత్సం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నదులు, చెరవులు, కాలువలు పొంగిపోయితున్నాయి. దీని వలన లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలోకి వరద నీరు చేరిపోవడంతో.. జన జీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. అంతేకాకుండా.. బలమైన గాలులు కారణంగా పెద్ద పెద్ద చెట్లు విరిగిపోవటం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవలే ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలంలోని భారీ వర్షల కారణంగా.. కొండచరియాలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే తాజాగా ఏపీలోని మరోసారి వర్షాల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడి పలవురు గాయలు పడ్డారు. ఇక ఈ ఘటనలో ఓ బాలిక కూడా మృతి చెందినట్లు సమాచారం. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ వర్షాల ధాటికి ఏపీలోని విజయవాడలో మొగల్రాజపురం సున్నబట్టి సెంటర్ వద్ద భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురికి గాయలయ్యాయి. ముఖ్యంగా ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటు.. మరో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక మృతి చెందినట్టు సమాచారం. ఇకపోతే కొండచరియాలు విరిగిపడటంతో పూర్తిగా దెబ్బ తిన్న ఇంట్లో పలువురు చిక్కుక్కున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో వెంటనే అధికారులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత..  విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంఘటన స్థలానికి వెళ్లి పరీశీలించారు.

Show comments