iDreamPost
android-app
ios-app

జైలుకు చంద్రబాబు.. NTR ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి కామెంట్స్!

  • Published Sep 11, 2023 | 11:37 AM Updated Updated Sep 11, 2023 | 12:06 PM
  • Published Sep 11, 2023 | 11:37 AMUpdated Sep 11, 2023 | 12:06 PM
జైలుకు చంద్రబాబు.. NTR ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులుగా సాగిన ఉత్కంఠతకు నిన్నరాత్రి తెరపడింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం సీఐడీ పోలీసు అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు పరిచారు.  ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి  ఇరు వర్గాల లాయర్లు తమ వాదనను వినిపించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఏసీబీ కోర్టు చంద్రబాబు కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో భారీ బందోబస్తు నడుమ చంద్రబాబు నాయుడిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించిన విషయం తెలిసిందే. చంద్రబాబు జైలుకు వెళ్లడంపై పలువురు నేతలు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి చంద్రబాబు జైలుకు వెళ్లడంపై సంచలన కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళితే..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అర్థరాత్రి ఒంటిగంట తర్వాత చంద్రబాబు పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఇక చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏపీలో వైసీపీ నేతలు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి.. చంద్రబాబుకి కోర్టు రిమాండ్ విధించడంపై ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిపరుడు అని తన భర్త ఎనాడో చెప్పాడు.. ఆయన పార్టీని, పదవిని లాక్కొని మానసికంగా హింసకు గురిచేసిన బాబు కి ఇప్పుడు పాపం పండిందని అన్నారు.

చంద్రబాబు రాజకీయంగా ఎదిగింది ఎన్టీఆర్ చలువ వల్లే అని.. అలాంటిది ఆయన పక్కన ఉంటూ వెన్నుపోటు పోడిచారని అన్నారు. తాను స్థాపించిన పార్టీని తన నుంచి లాక్కోవడంతో ఎన్టీఆర్ చివరి నిమిషం వరకు కృంగిపోయారు.. ఆందోళన చెందారు. ఆయన మరణాంతరం నన్నుకూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. నన్ను మానసికంగా ఎంతో క్షోభకు గురి చేశాడు.. ఈ విషయం నేను ఎన్నోసార్లు ప్రజాక్షేత్రంలో చెప్పుకొని బాధపడ్డాను. భగవంతుడు ఉన్నాడు.. ఇన్నాళ్ళకు చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి అయ్యిందని సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మీ పార్వతి. ప్రస్తుతం లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş