iDreamPost
android-app
ios-app

చంద్రబాబు చేసిన ప్రతి తప్పులో పవన్ ఉన్నాడు: లక్ష్మీపార్వతి

  • Published Oct 10, 2023 | 6:01 PM Updated Updated Oct 10, 2023 | 6:01 PM
  • Published Oct 10, 2023 | 6:01 PMUpdated Oct 10, 2023 | 6:01 PM
చంద్రబాబు చేసిన ప్రతి తప్పులో పవన్ ఉన్నాడు: లక్ష్మీపార్వతి

ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లింది. అందుకే వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే కీలక నిర్ణయాలు ఈ సభ ద్వారా ప్రారంభించారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీల అధినేతలను సీఎం జగన్ ఓ రేంజ్ లో ఆడుకున్నారు. వైసీపీ నేతలు సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా తెలుగు సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతీ పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పార్టీ నేతలు చేసిన దిశానిర్దేశాలను ఆమె వివరించారు. తమ నాయకుడు ప్రజలకు మంచి చేశారు.. కాబట్టే తాము ధైర్యం ఓట్లు అడుగతామని ఆమె తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల్లో నిలిచారని ఆమె తెలిపారు. తమ సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఆమె బలంగా చెప్పారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై కూడా తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. వారి పొత్తులే అనైతికమైని, చంద్రబాబు పవన్ ల గురించి తాము ఆలోచించడం  లేదని ఆమె తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ..”మా ముఖ్యమంత్రి గారు  చాలా స్పష్టంగా చెప్పారు. ఈ టీడీపీ, జనసేన పొత్తులు, వారి వ్యవహారం అంతా స్వార్థంతో కూడుకున్నాయని, దోచుకోవడంలో, పంచుకోవడంలో వారిద్దరు భాగస్వాములయ్యారని తెలిపారు. అందుకే చంద్రబాబు చేసిన ప్రతి తప్పుల్లో పవన్ కల్యాణ్ ఉన్నాడు. అందుకే చంద్రబాబుకు ఏం జరిగిన పవన్ కల్యాణ్ వెంటనే సపోర్టు చేస్తారు. అరిచే కుక్క కరవదు అనే సామెత ఉంది కదా.. అలానే కుక్కలు అరుస్తూనే ఉంటాయి. కానీ అన్నీ కరవు. అందుకే మేము అలా వారిని అలా భావించి వదిలేశాము” ఆమె తెలిపారు. మరి.. పవన్ కల్యాణ్ పై నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom