iDreamPost

లఖ్‌ పతి దీదీ కార్యక్రమంలో అదరగొట్టిన AP.. ప్రథమ స్థానంలో

  • Published Feb 22, 2024 | 2:49 PMUpdated Feb 22, 2024 | 2:49 PM

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం కేంద్రం తీసుకువచ్చిన లఖ్‌ పతి దీదీ కార్యక్రమంలో ఏపీ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. ఆ వివరాలు..

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం కేంద్రం తీసుకువచ్చిన లఖ్‌ పతి దీదీ కార్యక్రమంలో ఏపీ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. ఆ వివరాలు..

  • Published Feb 22, 2024 | 2:49 PMUpdated Feb 22, 2024 | 2:49 PM
లఖ్‌ పతి దీదీ కార్యక్రమంలో అదరగొట్టిన AP.. ప్రథమ స్థానంలో

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం కేంద్ర ప్రభుత్వం లఖ్‌పతి దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి.. వారు ఆర్థిక స్వాలంభన సాధించాలనే ఉద్దేశంతో లఖ్‌పతి దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు శిక్షణ ఇచ్చి.. వారు ఏడాదికి కనీసం లక్ష రూపాయల స్థిరమైన ఆదాయాన్ని పొందేలా చూడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇక లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ వివరాలు..

ప్రస్తుతం దేశంలో ‘లఖ్‌పతి దీదీలు’ సంఖ్య కోటి దాటిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. 13.65 లక్షల మంది మహిళలతో ఆంధ్రప్రదేశ్ లఖ్‌ పతి దీదీ కార్యక్రమంలో అగ్రగామిగా ఉంది. తర్వాతి స్థానాల్లో బిహార్ (11.16 లక్షలు), పశ్చిమ్ బెంగాల్ (10.11 లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో అట్టడుగున లక్షద్వీప్ (0), అండమాన్ నికోబార్ దీవులు (242), గోవా (206) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

గతేడాది ప్రధాని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ.. గ్రామాల్లో 2 కోట్ల మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీలు’ చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఈ లక్ష్యాన్ని 3 కోట్లకు పెంచారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద అమలు చేస్తున్న లఖ్‌ పతి దీదీ పథకం లక్ష్యాన్ని మూడేళ్లలో చేరుకోవాలని నిర్దేశించారు.

ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మహిళలకు శిక్షణ, ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్సింగ్, బ్యాంక్, క్రెడిట్ లింకేజీలతో సహాయం చేస్తుంది. తద్వారా వారు వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలలో సంవత్సరానికి రూ. 1 లక్ష స్థిరమైన వార్షిక ఆదాయాన్ని పొందుతారు. ఇక ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాల వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటిల్లో ముఖ్యమైంది.. వారు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. వారు స్వయం ఉపాధి పొందడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి