iDreamPost
android-app
ios-app

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. గ్యాస్ ట్యాంకర్ ను ఢీకొట్టిన సిలిండర్ల లారీ..

Kakinada District Tuni Mandal News: కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గ్యాస్ ట్యాంకర్ ను సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.

Kakinada District Tuni Mandal News: కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గ్యాస్ ట్యాంకర్ ను సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. గ్యాస్ ట్యాంకర్ ను ఢీకొట్టిన సిలిండర్ల లారీ..

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తుని మండలం తేటగుంట సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రహదారిపై గ్యాస్ ట్యాంకర్ ను ఒక సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ ట్యాంకర్ లో హైడ్రో క్లోరిక్ యాసిడ్ ను రవాణా చేస్తున్నారు. లారీ ఢీకొట్టడంతో గ్యాస్ టాంకర్ వాల్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ బయటకు లీకైపోయింది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకవడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగమంచు కప్పినట్లుగా కనిపించింది. హైడ్రో క్లోరిక్ గ్యాస్ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో అక్కడ దుర్వాసన వ్యాపించింది. అంతేకాకుండా ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల అక్కడ ఉన్న వారికి అందరికీ కళ్లు మంటలు రావడం, ఎక్కువగా ఆ గ్యాస్ పీల్చుకున్న వారికి వాంతులు అయ్యి బాగా ఇబ్బంది పడ్డారు.

ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు అంతా ఆందోళన చెందారు. గ్యాస్ సిలిండర్ల లారీ కావడంతో కంగారు పడిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అలాగే పోలీసులకు కూడా ప్రమాదం సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై కిలోమేటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు.

జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ కాస్త ఎక్కువగానే జామ్ అయ్యింది. ఈ హైడ్రో క్లోరిక్ యాసిడ్ లోడుతో ట్యాంకర్ విశాఖకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం పోలీసులు, ఫైర్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి తప్పు వల్ల జరిగింది? అనే విషయాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు. సిలిండర్ల లారీ కావడంతో భారీ ప్రమాదమే తప్పినట్లు అయ్యింది.