iDreamPost
android-app
ios-app

వేలంలో రూ.3.30 లక్షలు పలికిన చేప.. దీని ప్రత్యేకత ఇదే!

వేలంలో రూ.3.30 లక్షలు పలికిన చేప.. దీని ప్రత్యేకత ఇదే!

సముద్రాన్ని నమ్ముకుని బతికేవాళ్లు ఎందరో ఉన్నారు. వారిలో మత్స్యకారులు ప్రధానమైన వారు.  తెల్లవారింది మొదలు వారి ప్రయాణం సముద్రం వైపే సాగుతుంది. వేటకు కడలివైపు సాగి.. చేపలను పట్టుకుంటూ జీవనం సాగిస్తుంటారు.  అయితే మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో అప్పుడప్పుడు అరుదైన చేపలు.. వారి వలలో చిక్కుతూ ఉంటాయి. అత్యధిక బరువు, అరుదైన జాతికి చెందిన చేపలను పట్టుబడుతూ ఉంటాయి. కొన్ని అరుదైన చేపలకు మార్కెట్‌లో విపరీతంగా డిమాండ్ ఉంటుంది.  ఇలా వలకు చిక్కిన అరదైన చేపల్లో కొన్ని రూ.లక్షల్లోనే పలుకుతూ ఉంటాయి. తాజాగా కాకినాడ మత్స్యకారులకు అలాంటి లక్షల విలువ చేసే  చేప చిక్కింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలోని కుంభాభిషేకం రేవులో మత్య్యకారుల వలకు కచిడి చేప చిక్కింది. ఈ చేప 25 కేజీ బరువు ఉన్నట్లు మత్స్యకారులు వెల్లడించారు. దీనికి వేలం నిర్వహించగా  పది, ఇరవై వేలు కాదు.. ఏకంగా రూ.3.30 లక్షలు పలికింది.  ఓ వ్యక్తి వేలంలో ఈ కచిడి చేపను రూ.3.30 లక్షలకు కొనుగోలు చేశారు. అలానే ఈవేలంలో మధ్యవర్తికి రూ.25 వేల రూపాయలు దక్కాయి.  అయితే ఈ చేప అంత ధర పలకడంతో  చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని వలన కలిగే లాభాలు తెలిసి ముక్కున వెలేసుకుంటున్నారు. అత్యంత అరుదగా లభించే ఈ కచిడి చేపలో ఔషధ గుణాలు ఉన్నాయంట.

సముద్రంలో అరుదుగా లభించే ఈ కచిడి చేపను మత్సకారులు వరంగా భావిస్తారు. ఈ చేప లోపల ఉండే బ్లాడర్ కి డిమాండ్ ఉండడంతో భారీ ధర  వస్తుంటుంది. అందుకే కేవలం 25 కేజీల బరువున్న చేపను మూడు లక్షలకు పైగా ఖర్చు చేసి కొనుగోలు చేశారు. గతంలోనూ ఇదే స్థాయిలో కచిడి చేపలు అమ్ముడుపోయాయి. అయితే ఈ స్థాయిలో అమ్ముడు పోవడం అనేది.. ఇదే తొలిసారని చెబుతున్నారు. ఈ చేపకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మరి.. తమ వలలో చిక్కిన ఈ చేప భారీ ధర పలకడంతో మత్స్యకారుడు సంతోషం వ్యక్తం చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండిMLC కుంభా రవిబాబు చొరవతో.. Phd భారతికి SVUలో ఉద్యోగం!