చంద్రబాబు తరపు న్యాయవాదులపై జడ్జి అసహనం!

చంద్రబాబు తరపు న్యాయవాదులపై జడ్జి అసహనం!

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అంతేకాక చంద్రబాబు  అరెస్టైన స్కీల్  డెవలప్మెంట్ స్కాం విషయంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరుపక్షాల లాయర్లు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు పిటిషన్ వేయగా, కస్టడీకి అప్పగించాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరుతున్నారు. సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదోపవాదలను జరిగాయి. ఈ క్రమంలోనే బెయిల్ గురించి చంద్రబాబు తరపు లాయర్ల పదే పదే ప్రస్తావించడంతో జడ్జి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

చంద్రబాబు బెయిల్ కు సంబంధించి.. సోమవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల లాయర్లు తమ వాదనలను కోర్టు తెలియజేశారు. ముందు బెయిల్ పై విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పట్టుబట్టారు. కస్టడీ పిటిషన్ ఉండగా బెయిల్ పై ఎలా విచారణ జరుపుతామని న్యాయమూర్తి  అన్నారు. అయితే కొన్ని తీర్పులు ఉన్నాయని చంద్రబాబు తరపు లాయర్లు జడ్జికి తెలిపారు. కస్టడీ పిటిషన్ ఉండగా బెయిల్ పిటిషన్ పై విచారణ జరపకూడదంటూ పలు తీర్పులను సీఐడీ తరపు న్యాయవాదులు కూడా కోట్ చేశారు. కష్టడీ పిటిషన్ పై సీఐడీ వేసిన  మెమోపై నిర్ణయం తీసుకోవాలని బాబు తరపు లాయర్లు కోర్టుకు విన్నవించారు.

ఈనెల 14న బెయిల్ పిటిషన్ వేశామని, కాబట్టి ముందు ఆ పిటిషన్ వాదనలు విన్నాలని చంద్రబాబు తరపు లాయర్లు కోర్టును కోరారు. మెమో ఇంకా తన దగ్గరకు రాకుండానే నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు ఎలా చెబుతారంటూ జడ్జి సీరియస్ అయ్యారు. ఏ పిటిషన్ పై విచారణ జరపాలో పట్టుబట్టడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. బెయిల్, కస్టడీ పిటిషన్లలో తొలుత ఏది విచారించాలో రేపు నిర్ణయిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అలానే చంద్రబాబు పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments