iDreamPost

ఆలు లేదు, చూలు లేదు.. Jr.NTRకి పిఠాపురం వర్మ పదవి ఇప్పిస్తాడట!

SVSN Varma, Jr. NTR: ఇటీవలే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ యంగ్ టైగర్ ఎన్టీఅర్ పై చేసిన వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. అయితే తారక్ పై చేసిన కామెంట్స్ కి ఆయన ఫ్యాన్స్ వర్మపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.

SVSN Varma, Jr. NTR: ఇటీవలే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ యంగ్ టైగర్ ఎన్టీఅర్ పై చేసిన వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. అయితే తారక్ పై చేసిన కామెంట్స్ కి ఆయన ఫ్యాన్స్ వర్మపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.

ఆలు లేదు, చూలు లేదు.. Jr.NTRకి పిఠాపురం వర్మ పదవి ఇప్పిస్తాడట!

దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి ముగిసింది. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఏపీ వైపే ఉంది. అంతేకాక రెండు తెలుగు రాష్ట్ర ప్రజల దృష్టి ఎన్నికల ఫలితాలతో పాటు ఓ నియోజవర్గం ఫలితంపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాటిల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. దీంతో ఆయనతో పాటు అక్కడి స్థానిక టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ వెలుగులోకి వచ్చారు. ఇంకా చెప్పాలంటే..తానే ఏదో పవన్ ను గెలిపిస్తున్నట్లు తెగ ఫీలవుతున్నట్లు స్థానికంగా చర్చ. ఇదే సమయంలో ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఆ సంగతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కు స్థానికంగా కొంత బలం ఉంది. అయితే అదే ఆయన మిడిసిపడుతున్నాడని స్థానిక నేతలు అభిప్రాయాపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఎంట్రీతో తనకే సీటు దక్కించుకోలేకపోయిన వర్మ…తారక్ పై చౌకబారు వ్యాఖ్యలు చేశారు. తారక్ టీడీపీలోకి వస్తే.. ఏదో ఒక పదవి ఇస్తామని, లోకేశ్ తో ఆయనకు పోలిక ఏంటని వర్మ  తారక్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. అంతేకాక లోకేశ్ పెద్ద సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేయించారంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. అంతేకాక వర్మపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మరోసారి వైఎస్సార్ సీపీదే అధికారం అని  తేలింది. మెజార్టీ సర్వే సంస్థలు వైఎస్సార్ సీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తెలిపాయి. ఇలాంటి తరుణంలో వర్మ చేసిన కామెంట్స్ ఫన్నీగా ఉన్నాయి. ముఖ్యంగా అసలు ఫలితాలు రానేలేదు, ప్రభుత్వం ఏర్పాటు కానులేదు.. అప్పుడే తారక్ కి పదవి ఇస్తానంటూ ఆఫర్లు. ఆలు లేదు, చూలు లేదు.. కానీ కొడుకు పేరు సోమలింగం అన్నట్లు వర్మ మాటల తీరుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. వారి పార్టీకే దిక్కులేద, అయోమయ స్థితిలో ఉందని, అలాంటి వాళ్లు తారక్ ఆఫర్ల ఇవ్వడం ఫన్నీగా ఉందటున్నారు.

పిఠాపురంలో తనకే సీటుకు నిలబెట్టుకోలని వర్మ, తనను తాను ఏదో పెద్ద నేతగా, కూటమిలో కీలక వ్యక్తిని అన్నట్లు ఫీలవుతున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అసలు వర్మగా పార్టీలో దిక్కులేదని, అలానే టీడీపీ కూటమి అధికారంలోకి రానిదే..పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ తనపని తాను చేసుకుంటున్న తారక్ పై వర్మ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి