చంద్రబాబు అరెస్టుపై జేడీ లక్ష్మీనారాయణ రియాక్షన్.. ఏం చెప్పారంటే?

స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఏపీ సీఐడీ ఈ రోజు నంద్యాలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నైపుణ్యాభివృద్ధిపేరిట అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబును ప్రధాన నిందితుడిగా తేల్చారు. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ను, రిమాండ్ రిపోర్ట్ ను కోర్టుకు సబ్ మిట్ చేయనుంది. బాబు అరెస్ట్ అనంతరం విజయవాడకు తరలించిన సీఐడీ, ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. చంద్రబాబు తరఫున సిద్దార్థ్ లుధ్రా వాదనలు వినిపించనున్నారు. అయితే ఈ అంశంపై సీబీఐ మాజి డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో బాబుకు జైలు తప్పదా? బెయిల్ వస్తుందా లేదా అన్న విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం..

ఇక చంద్రబాబు అరెస్టుపై స్పందించిన జేడీ.. సీఐడీ సేకరించిన ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టనుంది.చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరే అవకాశాలున్నాయి. అయితే సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం జడ్జీ సీఐడి రిమాండ్ కు అప్పగించాలా లేదా జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలా అనేది నిర్ణయిస్తారని జేడీ తెలిపారు. సీఐడీ కస్టడీ పిటిషన్ తిరస్కరణకు గురైతే జడ్జి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. అప్పుడు చంద్రబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు వీలుంటుందని తెలిపారు. ఒక వేళ సీఐడీ కస్టడీకి అప్పగిస్తే విచారణ ముగిసే వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదని వెల్లడించారు.

అయితే సీఐడీ బాబును ప్రధాన నిందితుడిగా తేల్చిన నేపథ్యంలో దీనిలో ఇంకా ఎవరెవరి హస్తం ఉంది, అధికారులు ఏవిధంగా నిధులు విడుదల చేశారు అన్న కోణంలో విచారణ చేసి సాక్ష్యాధారాలను చూపించాల్సి ఉంటుందని తెలిపారు. మనీలాండరింగ్, సీమెన్స్ కంపెనీకి నిధులు మళ్లించడం వంటి వ్యవహారాల్లో ఈడీ విచారణ చేస్తుందని జేడీ చెప్పారు. దీనికి సంబంధించిన విషయాలను సీఐడీ ఈడీకి అందిస్తుంది. ఈ కేసుకు సంబంధముండి విదేశాలకు పారిపోయిన వారిని సీబీఐ సాయంతో ఇంటర్ పోల్ సిస్టం ద్వారా రప్పించ వచ్చు అని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇది ఆర్థికపరమైన అంశాలతో కూడిన కేసు కావడంతో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా విచారించాల్సి ఉంటుందని తెలిపారు.

Show comments