Arjun Suravaram
VV Lakshmi Narayana: ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్న సంగతి తెలిసింది. జై భారత్ నేషనల్ అనే పార్టీని ఆయన ప్రారంభించారు. తాజాగా తన పార్టీ ఎన్నికల గుర్తును గురించి ఆయన కీలక ప్రకటన చేశారు.
VV Lakshmi Narayana: ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్న సంగతి తెలిసింది. జై భారత్ నేషనల్ అనే పార్టీని ఆయన ప్రారంభించారు. తాజాగా తన పార్టీ ఎన్నికల గుర్తును గురించి ఆయన కీలక ప్రకటన చేశారు.
Arjun Suravaram
ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలతో పాటు కొత్త పార్టీలు ఆవిర్భవించాయి. అలానే మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్షీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయనుంది. ఆయన విశాఖ పట్నం జిల్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ గుర్తుపై కీలక ప్రకటన వచ్చింది. జై భారత్ నేషనల్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సీబీఐ మాజీ డైరెక్టర్ వి వి లక్ష్మీ నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమాజంలో జరిగే అనేక విషయాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. అంతేకాక రాజకీయ విషయాల్లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. కొంతకాలం క్రితమే ఆయన ఓ పొలిటికల్ పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. జై భారత్ నేషనల్ అనే పార్టీని లక్ష్మీనారాయణ ప్రారంభించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల గుర్తుగా టార్చి లైట్ ను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజవర్గాలకు కామన్ సింబల్ గా టార్చిలైట్ ను కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్ లైట్ గుర్తును కేటాయించడంతో జై భారత్ నేషనల్ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. రాష్ట్రానికి వెలుతరు పంచే విధంగా టార్చి లైట్ సింబల్ కేటాయించారని ఆయన తెలిపారు. ఇక లక్ష్మీనారాయణ పోటీ విషయానికి వస్తే.. తొలుత విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి లోక్ సభలో అడుగుపెట్టాలని జేడీ లక్ష్మీనారాయణ అనకుని సడన్గా ప్లాన్ మార్చారు. పార్లమెంట్ కి కాకుండా విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అంటూ ప్రకటించారు.
ఈక్రమంలోనే తాజాగా ఆయన విశాఖలో ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడే మకాం వేశారు. ఈయన 2019లో జనసేన పార్టీ తరఫున విశాఖ పట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తరువాత జనసేన పార్టీని వీడి..సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తన అవసరం రాష్ట్రానికి ఎక్కువగా ఉన్నందున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మరి.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు టార్చలైట్ గుర్తును కేటాయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.