iDreamPost
android-app
ios-app

జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు!

జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి  ఖాతాల్లోకి రూ.10 వేలు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారు. నిత్యం ప్రజశ్రేయస్సు కోసం పరితపిస్తూ.. అనేక అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నారు. ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తూ.. వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారు. నవరత్నాల పేరుతో వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఆర్ధిక భరోసాతో పాటు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు తరచూ సీఎం జగన్.. ఏదో ఒక శుభవార్త చెప్తూనే ఉంటారు. తాజాగా జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న తోడు పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌లో చిరు వ్యాపారులకు జగన్  ప్రభుత్వం అండగా నిలిచింది.  ఈ ఏడాది కూడా జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదల చేయనుంది. రేపు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి వారి అకౌంట్‌లలో డబ్బులు జమచేయనున్నారు. జగనన్న తోడు పథకంలో భాగంగా నాలుగో ఏడాది తొలి విడత కార్యక్రమాన్ని రేపు  ప్రభుత్వం నిర్వహించనుంది. జగనన్నతోడులో 5.1 లక్షల మంది ఖాతాల్లో  రూ.10 వేల చొప్పున రూ.510 కోట్లు జమ చేయనుంది. అలాగే వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి రూ.10.03 కోట్లను చెల్లించనుంది. చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రూ.10 వేల రుణాన్ని వడ్డీ లేకుండా అందిస్తోంది.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న తోడు ఒకటి. గ్రామ, వార్డు  సచివాయల్లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒక వేళ దరఖాస్తు చేయడం తెలియని పక్షంలో స్థానిక వాలంటర్ ని సంప్రందించి.. పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అర్హత కలిగిన వారికి రూ.10 వేల రుణం లభిస్తుంది.  ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, చేతి వృత్తులు వారు ప్రయోజనం పొందొచ్చు. అయితే కచ్చితంగా 18 ఏళ్లు వయసు నిండి వారే ఈ పథకానికి అర్హులు. అందుకు ఫ్రూప్ గా ఆధార్ కార్డు ఐడెంటిటీను ఉపయోగించ వచ్చు. అలానే కుటుంబ ఆదాయం విషయానికి వస్తే.. నెలకు గ్రామాల్లో అయితే రూ.10 వేలకు లోపు, పట్టణాల్లో రూ.12 వేలు లోపు ఉన్నవారు అర్హులు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలనే నిబంధన ఉంది. ఈ అర్హతలు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం కింద రూ.10వేల రుణం అందుతాయి. మరి.. జగన్ సర్కార్ చెప్పిన ఈ శుభవార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ కులాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. సాయం రూ.లక్షకు పెంపు!