iDreamPost
android-app
ios-app

పిల్లలను బడికి పంపవద్దు.. ‘కండ్లకలక’పై ఏపీ ప్రభుత్వం అలర్ట్!

పిల్లలను బడికి పంపవద్దు.. ‘కండ్లకలక’పై ఏపీ ప్రభుత్వం అలర్ట్!

తరచూ ఏదో ఒక వ్యాధి వచ్చి.. ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. గతంలో కరోనా మహమ్మారి కారణంగా ఎంతటో ఘోరం జరిగిందే అందరికి తెలిసిందే. ఆ కరోనా ఎన్నో కుటుంబాలను రోడ్డున పడ్డాయి. ఇక ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే  జనాలు భయటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కండ్లకలక అనే వ్యాధి  రెండు తెలుగు రాష్ట్రాలను కలవర పెడుతుంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకే లక్షణం ఉండటం వల్ల కండ్లకలక వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కంటి ఆస్పత్రుల్లో రోగుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయింది.

ఏపీలో కండ్లకలక వ్యాధి బాగా వ్యాపిస్తుంది. దీంతో రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి.  ఈక్రమంలోనే పాఠశాలల విద్యార్థులకు ఈ వ్యాధి సులువుగా సోకే ప్రమాదం ఉంది. అలానే పిల్లలకు అవగాహన లేకపోవడం వల్ల కండ్లకలక వచ్చినా తెలియకపోవడంతో జాగ్రత్తలు తీసుకోలేరు. దీంతో విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. కండ్లకలక వ్యాధికి సంబంధించిన విషయాలపై ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు ప్రజలకు జగన్ సర్కార్ కీలక సూచనలు జారీ చేసింది.

కళ్లు నొప్పిగా ఉండటం, దురద రావడం,  కళ్లు వాపు అవ్వడం, ఏర్రగా మారి నీరు రావడం, నిద్ర లేచిన తర్వాత కళ్లు అతుక్కుపోవడం లాంటివి కండ్ల కలక లక్షణాలు అని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈలాంటి లక్షణాలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే కళ్ల నుంచి చీము వచ్చే అవకాశముందని తెలిపింది. ఈ వ్యాధి సోకినప్పుడు తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని, కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచించింది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచనలు చేసింది. అలానే కండ్లకలక లక్షణాలు ఉన్న పిల్లలను బడికి పంపవద్దని సూచించింది. కండ్లకలక బారిన పడిన పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్‌కి పంపించవద్దని పేర్కొంది. మరి.. ప్రభుత్వం చేసిన సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏపీలో డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్.. దేశంలో తొలిసారిగా..!