Dharani
YS Raja Reddy, Priya Atluri Love Marriage News: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట పెళ్లి వేడుకలు జరగబోతున్నట్లు సమాచారం. ఆమె కుమారుడు రాజా రెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారట. ఆ వివరాలు..
YS Raja Reddy, Priya Atluri Love Marriage News: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట పెళ్లి వేడుకలు జరగబోతున్నట్లు సమాచారం. ఆమె కుమారుడు రాజా రెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారట. ఆ వివరాలు..
Dharani
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు సమాచారం. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. షర్మిల కుమారుడిది కూడా ప్రేమ వివాహం అని తెలుస్తుంది. ఇక రాజా రెడ్డి వివాహం చేసుకోబోయే యువతి పేరు ప్రియ అట్లూరిగా తెలుస్తోంది. వీరిద్దరికి అమెరికాలో పరిచయం ఏర్పడిందని.. గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. ప్రియ అమెరికా సిటిజన్ అని తెలుస్తోంది. వీరిద్దరూ చర్చ్ మేట్స్ అని వార్తలు వస్తున్నాయి. మరో ఆసక్తిర అంశం ఏంటంటే.. ప్రియా అట్లూరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన యువతి మాత్రమే కాక ప్రముఖ చట్నీస్ హెటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలుగా తెలుస్తోంది.
ఇక ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాలి. ఇక రాజా రెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచ్ లర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తిచేశారు. ల్లాస్ యూనివర్సిటిలో జరిగిన కాన్వకేషన్ కు షర్మిలతోపాటు ఆమె భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ, కూతురు అంజలి రెడ్డి తరలివెళ్లిన సంగతి తెలిసిందే.
షర్మిల అప్పుడప్పుడు కొన్న ప్రత్యేక సందర్భాల్లో కొడుకు ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వీటిని చూసిన నెటిజనులు.. రాజా రెడ్డి హీరోలా ఉన్నారని కామెంట్స్ చేసేవారు. పైగా గతంలో రాజా రెడ్డినిన హీరోగా లాంఛ్ చేయబోతున్నారు అనే వార్తలు వచ్చాయి.
ఇక షర్మిలది కూడా ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. ఆమె బ్రదర్ అనిల్ ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిది కూడా ఇంటర్ క్యాస్ట్ వివాహామే. షర్మిల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆమె కాగా.. బ్రదర్ అనిల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన మతబోధకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం షర్మిల తెలంగాణ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నారు. వైఎస్సార్టీపీ అనే పార్టీ స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు.
#RajaReddy, the son of YS Sharmila, is soon to marry Priya Atluri. This union marks an intercaste marriage, bridging the Reddy and Kamma communities.
Read @greatandhranews Story | https://t.co/108V03pMG8#Yssharmila
— greatandhra (@greatandhranews) December 2, 2023