ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న విద్యారంగ సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏపీలో మారిన ప్రభుత్వ బడుల రూపురేఖలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఏపీ ముఖ్య మంత్రి జగన్ తీసుకొస్తున్న నూతన విద్యా విధానాలు ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక చర్చకు వచ్చాయి. జగనన్న కానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు,ట్యాబ్ లు, డిక్షనరీ, బెల్టు, బూట్లతో పాటుగా మరెన్నో సౌకర్యాలను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నాడు-నేడు’ స్టాల్ ను న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జగనన్న విద్యా కనుక, అమ్మ ఒడి లాంటి పథకాలు విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయిని అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర అభివృద్ధికి సంబంధించిన హై లెవెల్ పొలిటికల్ ఫోరం సదస్సును ఈనెల 10 నుంచి న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. కాగా.. ఐరాసలో అంతర్భాగమైన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సదస్సులో ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలపై ఈ సదస్సులో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో భాగంగా.. ఏపీ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులపై నిర్వహించిన ‘నాడు-నేడు’ స్టాల్ ను పలు దేశాల ప్రతినిధులు సందర్శించి ప్రశంసలు కురిపించారు. 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలను ఆ ప్రతినిధులు తిలకించారు. 140 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో ఏపీ విద్యా సంస్కరణల గురించి ఐరాస ప్రత్యేక కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ షకిన్ కుమార్ వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు జరిగే ఐరాస ప్రత్యేక సదస్సుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 విద్యార్థులను అమెరికా తీసుకెళ్లనున్నారు.
ఇదికూడా చదవండి: హీటెక్కనున్న స్టేట్ పాలిటిక్స్! తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ?