Uppula Naresh
Uppula Naresh
దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే ఏపీలోని కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో సైతం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ, ఇక్కడ జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేసి ఘోరంగా అవమానించారు. ఇక రివర్స్ లో ఎగరేసిన జెండాకే వందనం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే దీన్ని కొందరు చదువుకున్న వ్యక్తులు గమనించారు.
దగ్గరకు వెళ్లి చూడగా నిజంగానే జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేసి అవమానించారు. ఇక ఇదే ఘటనను కొందరు స్థానికులు వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే స్థానిక బీజేపీ నేతల తీరుపై అంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేసి ఇలా అవమానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాకినాడ బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగిన అవమానంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
జాతీయ జెండాను అవమానించిన బీజేపీ
కాకినాడ – రాజాం పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని నేడు ఆవిష్కరించారు. అయితే.. తలకిందులుగా ఎగరేసిన జెండాకే వందనం చేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
బీజేపీ నాయకుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. pic.twitter.com/paKS3kvd5c
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2023
ఇది కూడా చదవండి: వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు: సీఎం జగన్