రైతు బిడ్డకు ఇంటర్‌లో 968 మార్కులు! ఇది కదా సక్సెస్‌ అంటే..

Inspirational Success Story: ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేకున్నా.. చదువుకోవాలనే జిజ్ఞాస, పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించింది ఓ రైతు ఆడబిడ్డ. ప్రభుత్వ కాలేజ్ లో టాపర్ గా నిలిచింది.

Inspirational Success Story: ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేకున్నా.. చదువుకోవాలనే జిజ్ఞాస, పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించింది ఓ రైతు ఆడబిడ్డ. ప్రభుత్వ కాలేజ్ లో టాపర్ గా నిలిచింది.

ఈ కాలంలో మంచి ఉద్యోగాలు సాధించాలంటే.. మంచి చదువు ఉండాలి. ఇందుకోసం పిల్లల తల్లిదండ్రులు ఉన్నత విద్యాసంస్థల్లో చేర్పించి చదివిస్తారు. కానీ కొంతమంది పేదరికంలో ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలనే కోరిక ఎంతో ఉన్న ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతుంటాయి. అయినా కూడా వాటిని లెక్క చేయకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి తాము అనుకున్న లక్ష్యాలను సాధించినవారు ఎంతోమంది ఉన్నారు.ఓ రైతు కూతురు పేదరికాన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతూ మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్ లో కాలేజ్ టాపర్ గా నిలిచింది. ఆ బాలిక కృషి, పట్టుదలకు అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

రైతు కుటుంబంలో పుట్టి పేదరికాన్ని లెక్కచేయకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఇంటర్ లో మంచి మార్కులు సాధించి అందరిచే శభాష్ అనిపించుకుంది కాపెర్ల సాయిశ్వేత. అన్నమయ్య జిల్లా మిట్ల కమ్మపల్లి గ్రామంలో కాపెర్ల సుబ్బరాయుడు, అంజమ్మలకు జన్మించింది సాయిశ్వేత. ఏడవ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో చదవాల్సి వచ్చింది. ఒకదశలో సాయి శ్వేతకు పుస్తకాలు కొనే స్థోమత కూడా లేకపోయింది.. ఆసమయంలో హిందీ టీచర్ సత్తార్ హుస్సేన్ ఆమెకు పుస్తకాలు ఇప్పించేవారు. టెన్త్ క్లాస్ లో 530 మార్కులు సాధించిన సాయి శ్వేత ఈ తర్వాత ఉన్నత చదువులు చదవాలని భావించింది. ఇంటర్ లో 968 మార్కులు సాధించి టాపర్ గా నిలిచిన సాయి శ్వేత మీడియాతో తన సంతోషాన్ని పంచుకుంది.

‘మా నాన్న రైతు అయినప్పటికీ ప్రస్తుతం వ్యవసాయం అనుకూలించకపోవడంతో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. ఓ వైపు వ్యవసాయం చేస్తూనే ఎలక్ట్రిక్ పని నేర్చుకోవడం వల్ల ఇప్పుడు అది జీవనోపాధి అయ్యింది. కరోనా సమయంలో తిండికి సైతం ఇబ్బందులు పడ్డాం. నేను బాగా చదువుతానని మా తల్లిదండ్రులకు తెలుసు.. అయినప్పటికీ ఆర్థిక స్థోమత సరిగా లేక నా గురించి ఎంతోబాధపడేవారు. మా నాన్న నా చదువు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎన్నికష్టాలు ఎదురైనా.. నేను పట్టుదలతో చదివి నా తల్లిదండ్రుల పేరు, ఉపాధ్యాయుల పేరు నిలపాలని నిర్ణయించుకొని కష్టపడి చదివి ఇంటర్ లో 968 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ గా నిలిచాను. ’ అని తెలిపింది. పేదరికంలో ఉన్నా చదువుకు ఏదీ అడ్డు రాదని రైతు బిడ్డ నిరూపించిందని ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.

Show comments