iDreamPost
android-app
ios-app

Inspiration Story: విద్యార్థుల కోసం కత్తెర పట్టిన హెడ్ మాస్టర్.. అసలు కథ ఏంటంటే?

ఉపాధ్యాయుడు అంటే విద్యా నేర్పేవాడు మాత్రమే కాదు.. బుద్దులు కూడా నేర్పేవాడు. ఈ ప్రధానఉపాధ్యాయుడు పిల్లకోసం చేస్తున్న సేవ అంతకు మించిందనే చెప్పాలి.

ఉపాధ్యాయుడు అంటే విద్యా నేర్పేవాడు మాత్రమే కాదు.. బుద్దులు కూడా నేర్పేవాడు. ఈ ప్రధానఉపాధ్యాయుడు పిల్లకోసం చేస్తున్న సేవ అంతకు మించిందనే చెప్పాలి.

Inspiration Story: విద్యార్థుల కోసం కత్తెర పట్టిన హెడ్ మాస్టర్.. అసలు కథ ఏంటంటే?

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే పిల్లల పట్ల తల్లి తండ్రుల తర్వాత బాధ్యత వహించాల్సింది గురువు. విద్యార్థులకు మంచిని బోధిస్తూ.. తానే నిరంతర విద్యార్థి అయ్యే వ్యక్తి గురువు. అయితే, కొంతమంది టీచర్లు కేవలం పాఠాలను బోధించడమే కాకుండా పిల్లల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపాధ్యాయులు… కొన్నిసార్లు క్రమశిక్షణను కూడా నేర్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే,  గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు.. ఏకంగా వారి విద్యార్థుల తల వెంట్రుకలను తానే కత్తిరించి.. వారిపట్ల ఉన్న బాధ్యతను కనబరిచాడు.

అల్లూరి జిల్లా హుకుంపేట గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో.. దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా ఆ చుట్టుప్రక్కల మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజన పిల్లలు. అదే పాఠశాలలో చదువుతూ.. అక్కడే ఉంటూ ఉంటారు. వారిని చూసుకునేందుకు టీచర్లు, సిబ్బంది కూడా పదిమంది వరకు ఉంటారు. అయితే, అక్కడ ఉన్న వారందరిని నడిపించే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం ప్రత్యేకం. దీనికి కారణం లేకపోలేదు. ఆ ఉపాద్యాయుడు పిల్లల పట్ల బాధ్యతతో పాటు ఎనలేని ప్రేమను కనబరుస్తూ ఉంటాడు. ఆ ప్రధానోపాధ్యాయుడి పేరు బాలాజీ. తల్లి తండ్రులు.. పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులపైన నమ్మకంతో తమ పిల్లలని బడికి పంపిస్తూ ఉంటారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేలా బాలాజీ.. ఒక ప్రధానోపాధ్యాయుడిగా తన వృత్తిని నిర్వహిస్తూనే.. విద్యార్థుల వ్యక్తిగత విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. వారికి కావాల్సిన సదుపాయాలు అందిస్తూ ఉంటారు.

ఏ విద్యార్థికైనా ముందుగా ఉండాల్సింది క్రమశిక్షణ. అది కేవలం పాఠశాల స్థాయి నుంచి మాత్రమే అబ్బుతుంది. అయితే, తన పాఠశాలలోని విద్యార్థుల కోసం బాలాజీనే బాధ్యత వహించాడు. ఈ క్రమంలో.. ముందుగా  విద్యార్థులకు యూనిఫామ్, హెయిర్ స్టైల్ క్రమశిక్షణకు తగ్గట్టుగా ఉండాలని భావించాడు. ఆ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే, క్షురకుడు రాకపోవడంతో.. విద్యార్థుల్లో చాలా మందికి తల వెంట్రుకలు బాగా పెరిగిపోయాయి. దీంతో వారి ఇబ్బందిని గుర్తించి తానే స్వయంగా చేతిలో కత్తెర పట్టుకున్నాడు. విద్యార్థుల సమ్మతితో సందర్భాన్ని బట్టి క్షురకుడులా మారి సేవలు ప్రారంభించాడు ఈ ప్రధానోపాధ్యాయుడు. ఖాళీ సమయంలో జుట్టు పెరిగిపోయిన వారి తల వెంట్రుకలను కత్తెర పట్టుకుని తానే స్వయంగా కత్తిరిస్తున్నాడు. ఇప్పటివరకు దాదాపుగా 20 మంది పిల్లలకు తానే స్వయంగా ఈ పనిని చేశాడు.

అందరి పిల్లలతో సమానంగా ఉంటూ.. వారికీ క్రమశిక్షణ అలవాటు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు బాలాజీ. విద్యార్థులంతా పాఠశాల్లో క్రమ పద్ధతిలో కనిపించాలని.. వారిలో క్రమశిక్షణ అలవర్చాలని ఇటు వంటి సేవ చేస్తున్నానని..  చెప్పుకొచ్చారు ప్రధాన ఉపాధ్యాయుడు బాలాజీ. ఏదేమైనా, విద్యార్థులకు పాఠాలు చెప్పడం మాత్రమే తమ బాధ్యత అనుకునే.. కొంతమంది ఉపాధ్యాయులకు, పిల్లలకు కొన్నిసార్లు సేవ చేస్తూ వారిని సరైన దారిలో పెట్టడం కూడా.. ఉపాధ్యాయుల వంతేనని.. బాలాజీ చేసి చూపిస్తున్నారు. మరి, విద్యార్థుల కోసం కత్తెర పట్టుకున్న ప్రధానోపాధ్యాయుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి