ఏపీ రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొన్ని రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

ఈ మధ్య తరుచుగా ఎక్కడబడితే అక్కడ ట్రాక్ మరమత్తులు పనులు జరుగుతుండటంతో రైల్వే శాఖ పలు రైల్లను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరి కొన్ని రైళ్లను దారి మళ్లీస్తూ ప్రయాణికులకు అలర్ట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా  రైల్వే శాఖ ప్రయాణికులకు పలు రైల్లను రద్దు చేసినట్లు అలర్ట్ చేసింది.

ఈ మధ్య తరుచుగా ఎక్కడబడితే అక్కడ ట్రాక్ మరమత్తులు పనులు జరుగుతుండటంతో రైల్వే శాఖ పలు రైల్లను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరి కొన్ని రైళ్లను దారి మళ్లీస్తూ ప్రయాణికులకు అలర్ట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా  రైల్వే శాఖ ప్రయాణికులకు పలు రైల్లను రద్దు చేసినట్లు అలర్ట్ చేసింది.

ఈరోజుల్లో ట్రైన్ జర్నీ ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే.. టికెట్ ధర తక్కువ,  తక్కువ సమయంలో గమ్య స్థానాలకు త్వరగా చేరిపోయే వెసులుబాటు కలిగి ఉంటుంది. కనుక చాలామంది ఈ ట్రైన్ జర్నికే  ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే.. సామాన్య ప్రయాణికుల దగ్గర నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు సైతం తరుచు రైలులో లక్షాలది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మత్తులు, రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కారణంగా.. రైల్వే శాఖ పలు రైల్లను రద్దు చేయడం, మిగిలిన రైళ్లను దారి మళ్లించడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా  రైల్వే శాఖ ప్రయాణికులకు పలు రైల్లను రద్దు చేసినట్లు అలర్ట్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ మధ్య తరుచుగా ఎక్కడబడితే అక్కడ ట్రాక్ మరమత్తులు పనులు జరుగుతుండటంతో రైల్వే శాఖ పలు రైల్లను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరి కొన్ని రైళ్లను దారి మళ్లీస్తూ ప్రయాణికులకు అలర్ట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఏపీ మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లీస్తున్నట్లు తాజాగా రైల్వే అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా నాగపూర్‌ డివిజన్‌లో ఇంటర్‌ లాకింగ్‌ పనుల జరుగుతున్న కారణంగా.. పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్‌ మీదుగా దారి మళ్లిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు.

అందులో విశాఖపట్నం-హజ్రత్‌ నిజాముద్ధీన్‌ (12807/12808 ) రైలు ఆగస్టు 6, 10, 11, 12, 13, 14, 15, 18 తేదీల్లో దారి మళ్లిస్తున్నారు. దీంతో పాటు  ఎర్నాకుళం-బిలాస్‌పూర్‌ (22815/22816) రైలు ఆగస్టు 12, 14 తేదీల్లో, ఎల్‌టీటీ ముంబై-విశాఖపట్నం (22847/22848) రైలు ఆగస్టు 18,20 తేదీల్లో దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే  సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ (12771/12772) ఆగస్టు 7, 8, 14, 15 తేదీల్లో నాందెడ్‌-సంత్రాగచి (12767/12768) ఆగస్టు 12,14 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు . అయితే తరుచు ఏదో ఒక పనులతో  రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు ఈ రైల్లు దారి మళ్లింపు, పలు రైల్లు రద్దు అయిన విషయాలను గమనించి తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచింది. మరీ, నాగపూర్ డివిజన్ లో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో పలు రైల్లు రద్దు చేయడం, దారి మళ్లీంచడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments