దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరేశారు. అలానే ఏపీలో కూడా స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్.. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రా ప్రభుత్వంలోని వివిధ శాఖలు, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాలను ప్రదర్శించారు. ఇక ఈ వేడుకల్లో సీఎం జగన్ ప్రసంగించారు. స్వాతంత్ర సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ.. మన జాతీయ జెండా ఎగురుతోందని సీఎం జగన్ తెలిపారు. ఈ 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించిదని, వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించిందన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..”ఏపీలో మన ప్రభుత్వం విషయానికి వస్తే.. 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాము. గ్రామాల్లో విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీలు ప్రారంభించాము. అదే విధంగా పౌర సేవల్ని ఇంటింటికి అందించగలిగాం. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చాం. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తున్నాం. ఎలాంటి లంచాలు, అవినీతి, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు ఇచ్చాం. రాష్ట్రంలో సామాజిక న్యాయం నినాదం కాదు.. దాన్ని అమలు చేసి చూపాం. ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నాము.
వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. అంటరానితం మీద యుద్ధాన్ని ప్రకటించాం. అర్హులందరికీ పథకైాలు అందించేందుకు ఏర్పాట్లు చేశాం. రైతులకు, పేదలకు భరోసా ఇచ్చేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నాం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాము ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగే పరిస్థితి లేదు. అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నాం” అని సీఎం జగన్ ప్రసంగించారు. మరి.. సీఎం చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.