Tirupathi Rao
Sharmila- Mydukur: మైదుకూరు నియోజకవర్గంలో షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. ఆవిడ మాట్లాడుతున్న సమయంలో అందరూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆవేశంతో సవాలు విసరగా.. ఒక వ్యక్తి వచ్చి షర్మిల ఎదుటే ఎందుకు జగన్ ఓటు వేయాలో వివరించాడు.
Sharmila- Mydukur: మైదుకూరు నియోజకవర్గంలో షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. ఆవిడ మాట్లాడుతున్న సమయంలో అందరూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆవేశంతో సవాలు విసరగా.. ఒక వ్యక్తి వచ్చి షర్మిల ఎదుటే ఎందుకు జగన్ ఓటు వేయాలో వివరించాడు.
Tirupathi Rao
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రజలు మాత్రం మరోసారి జగన్నే ఎన్నుకుంటామంటూ తెగేసి చెప్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. మైదుకూరు నియోజకవర్గంలో ఆవిడ మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న ప్రజలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. మళ్లీ జగన్ కే తమ ఓటు అంటూ చెప్పకనే చెప్పారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన షర్మిల ఒక సవాలు విసిరారు. అక్కడున్న వారిలో ఎవరైనా వచ్చి అసలు ఎందుకు జగన్ కు ఓటేయాలో చెప్పండి అంటూ సవాలు చేశారు. మీకు దమ్ముంటే మైక్ ఇస్తాను మైకులో మాట్లాడండి అని కోరారు.
జై జగన్ అంటూ నినాదాలు చేయడంపై సీఎం జగన్ చేసిన సంక్షేమం ఏంటో చెప్పాలంటూ షర్మిల సవాలు విసిరారు. ఎవరైనా ఒక్కరు వచ్చి తమకు జరిగిన సంక్షేమం గురించి చెప్పాలని కోరారు. ఇంకేముంది.. మైదుకూరు జేసీఎస్ కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి మైక్ తీసుకున్నారు. అసలు జగన్ కు మళ్లీ ఎందుకు ఓటు వేయాలో వివరించారు. అసలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో స్పష్టంగా అర్థమయ్యేలా వివరించారు. పాదయాత్రలో వైఎస్ జగన్ తమ సమస్యలు విన్నారన్నారు. తమకు ప్రతి క్షణం అండగా నిలబడ్డారంటూ చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు.
చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. “పార్టీ పెట్టినప్పటి నుంచి మాకోసం జగన్ తిరుగుతూనే ఉన్నారు. పేద ప్రజల కోసం ఆయన పాదయాత్ర చేసి వారి సమస్యలను విన్నాడు. వారి సమస్యలు తీరుస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మా సమస్యలు అన్నీ తీర్చారు. ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయి. తెలంగాణలో మీరు చెప్పారు.. తెలంగాణలో ఉంటాను పోటీ చేస్తాను అని చెప్పారు. కానీ, మీరు అక్కడ పోటీ చేయలేదు. మీ మీద మాకు అభిమానం ఉంటుంది అక్క. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీ మీద మాకు ఎప్పటికీ అభిమానం ఉంటుంది. కానీ, జగన్ మోహన్ రెడ్డి గారు మాకోసం ఉన్నారు” అంటూ చంద్ర ఓబుల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చంద్ర ఓబుల్ రెడ్డి చివర్లో జోహార్ వైఎస్సార్, జై జగన్ అంటూ ఆయన నినాదాలు చేయగానే అక్కడున్న వాళ్లంతా కూడా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ ప్రజలు అందరూ ఇదే మాట చెబుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ ఓటు జగనే అంటూ స్పష్టం చేస్తున్నారు. ఈసారి కూడా వైఎస్సార్ సీపీని గెలిపించుకుంటాం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయడం జరుగుతుంది అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.