AP Subsidy Tomatoes Per Kg Rs 48: ఆ రైతు బజారులో టమాటా కిలో రూ.48.. క్యూ కట్టిన జనాలు

Tomato: ఆ రైతు బజారులో టమాటా కిలో రూ.48.. క్యూ కట్టిన జనాలు

AP Subsidy Tomatoes Per Kg Rs 48: టమాటా ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఒక చోట మాత్రం.. కిలో 48 రూపాలకే లభిస్తుండటంతో.. జనాలు పెద్ద ఎత్తున ‍క్యూ కడుతున్నారు. ఆ వివరాలు..

AP Subsidy Tomatoes Per Kg Rs 48: టమాటా ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఒక చోట మాత్రం.. కిలో 48 రూపాలకే లభిస్తుండటంతో.. జనాలు పెద్ద ఎత్తున ‍క్యూ కడుతున్నారు. ఆ వివరాలు..

మార్కెట్‌లో అన్నింటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. కూరగాయలు, నిత్యవసరాలు, ఇలా అన్నింటి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇక వర్షాకాలం ప్రారంభం నుంచి కూరగాయల ధరలు కొండెక్కాయి. కొన్నింటి ధరలైతే కిలో 120-150 రూపాయల వరకు చేరింది. ఇక సామాన్యంగా ఈ సీజన్‌లో ఉల్లి, టమాటా ధరలు భారీగా పెరుగుతాయి. ఇక గత ఏడాది అయితే టమాటా రేటు కిలో మీద ఏకంగా 200 రూపాయలు చేరిన సంగతి తెలిసిందే. గతేడాది టమాటా సాగు చేసిన రైతులు.. లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారంటే రేటు ఎంత భారీగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది కూడా టమాటా, ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కాకపోతే గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం రేట్లు.. కాస్త తక్కువగానే ఉన్నాయి.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా 80-100 రూపాయలు పలుకుతుంది. వారం రోజుల క్రితం వరకు కూడా టమాటా ధర 50 రూపాయలు ఉండగా.. ఈ వారం ధర ఒక్కసారిగా పెరిగింది. అందుకు కారణంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు. భారీ వానల కారణంగా పంట కోత, రవాణాకు ఇబ్బంది ఏర్పడటంతో.. మార్కెట్‌కు టమాట దిగుబడి తగ్గింది అంటున్నారు. దాంతో ఈ వారంలో టమాటా రేటు మరోసారి సెంచరీ దిశగా దూసుకుపోయింది. ప్రస్తుతం ఓపెన్‌ మార్కెట్‌లో టమాటా కిలో ధర ఏకంగా 80 రూపాయల వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఓ చోట మాత్రం కిలో కేవలం రూ.48 లకే అమ్ముతుండటంతో.. జనాలు పెద్ద ఎ‍త్తున క్యూ కడుతున్నారు. ఇంతకు ఎక్కడంటే..

టమాటా ధర రోజురోజుకు పెరుగుతుంది. దాంతో జనాలు దాన్ని కొనాలంటేనే భయపడుతున్న తరుణంలో.. కొన్ని చోట్ల మాత్రం సబ్సిడీ ధరకే అందిస్తుండటంతో జనాలు అక్కడకు క్యూ కడుతున్నారు. రైతు బజార్‌ రేటు కన్నా తక్కువకే అమ్ముతుండటంతో.. తెల్లవారుజాము నుంచే లైన్​లలో వేచి చూస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఇదే దృశ్యం కనిపించింది. ఇక్కడ రైతు బజారులో కిలో టమాటా కేవలం 48 రూపాయలకే అమ్ముతుండటంతో.. ఉదయం 6 గంటల నుంచే.. ప్రజలు కిలోమీటరు మేర బారులు తీరారు. బయట మార్కెట్లో కిలో టమాట 80 రూపాయలు ధర పలుకుతుంది. దీంతో జనమంతా సబ్సిడీ మీద ఇచ్చే టమాటాల కోసం రైతు బజారుకు తరలివచ్చారు. ఇతర రైతు బజారుల్లోనూ టమాటలు అందుబాటులో ఉంచాలని, ధరలు దిగివచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Show comments