iDreamPost

AP ప్రజలకు హెచ్చరిక.. మళ్లీ 40 డిగ్రీలకు ఎండలు.. ముఖ్యంగా ఆ జిల్లాల్లో..!

IMD Vizag- Again HeatWaves In Andhra pradesh: విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద ఏపీ ప్రజలను అలర్ట్ చేశారు. రాష్ట్రంలో మరోసారి పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరనున్నాయి. వాయుగుండం కారణంగా కేవలం ఒకటి రెండుచోట్ల మాత్రమే వర్షం కురుస్తుంది.

IMD Vizag- Again HeatWaves In Andhra pradesh: విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద ఏపీ ప్రజలను అలర్ట్ చేశారు. రాష్ట్రంలో మరోసారి పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరనున్నాయి. వాయుగుండం కారణంగా కేవలం ఒకటి రెండుచోట్ల మాత్రమే వర్షం కురుస్తుంది.

AP ప్రజలకు హెచ్చరిక.. మళ్లీ 40 డిగ్రీలకు ఎండలు.. ముఖ్యంగా ఆ జిల్లాల్లో..!

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు చల్లటి వార్త అందింది. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకో 5 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతవారణ శాఖ కేంద్రం డైరెక్టర్ సునంద వెల్లడించారు. అయితే ఇది అందరికీ శుభవార్త మాత్రం కాదు. కేవలం ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మళ్లీ ఎండలు మండిపోనున్నాయి.

విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద మాట్లాడుతూ.. “తమిళనాడు పరిసర ప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం కారణంగా ఆ తర్వాతి 24 గంట్లలో అది వాయుగుండంగా మారనుంది. అల్పపీడనం.. వాయగుండంగా మారిన తర్వాత ఈశాన్య దిశలో అది కదిలే ఆస్కారం ఉంది. వాయుగుండం ఈశాన్య దిశగా ప్రయాణించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడే ఆస్కారం కనిపిస్తోంది. ఈ వాయుగుండం కారణంగా రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ వర్షాలు కేవలం ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే కురుస్తాయి. అలాగే వర్షాలు ఉన్న ప్రాంతంలో మేఘాలతో వాతావరణం చల్లగా మారుతుంది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది.

మరో ఐదు రోజులపాటు ఒకటి రెండు ప్రాంతాల్లో వాయుగుండం కారణంగా ఈ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. అయితే మళ్లీ రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఇప్పుడు 30 నుంచి 34 డిగ్రీలు నమోదు అవుతుండగా.. అవి 40 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో తిరిగి ఎండలు పెరగనున్నాయి” అంటూ విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద వెల్లడించారు. ఈ వార్త విన్న తర్వాత ఏపీ ప్రజలు కాస్త కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వాతావరణం చల్లబడింది. కానీ, ఇలా మళ్లీ ఎండలు అనేసరికి కంగారు పడుతున్నారు. అయితే ఒక రెండువారాలు ఈ ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే అండమాన్ నికోబార్ చేరుకున్న నైరుతి రుతుపవనాలు.. త్వరలోనే కేరళలో ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత జూన్ 8 నుంచి 11వ తారీఖు మధ్య తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. నైరుతిరుతుపవనాలు వచ్చిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి