iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్‌.. రానున్న 5 రోజులు వర్షాలు

  • Published Aug 23, 2023 | 9:54 AM Updated Updated Aug 23, 2023 | 9:56 AM
  • Published Aug 23, 2023 | 9:54 AMUpdated Aug 23, 2023 | 9:56 AM
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్‌.. రానున్న 5 రోజులు వర్షాలు

20 రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ రీతిలో వర్షాలు కురవడంలేదు. అక్కడక్కడా తేలకికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యాయి. జూలై నెల చివర్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. వారం, పది రోజుల పాటు.. రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఆ తర్వాత వాన జాడే లేకుండా పోయింది. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాననున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది.

తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఫలితంగా మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌ను జారీ చేశారు.

ఏపీకి వర్ష సూచన

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నేడు అనగా బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇక మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి.. మోస్తరు వర్షాలు కురిశాయి.