iDreamPost
android-app
ios-app

AP, Telangana Rains: ఏపీ, తెలంగాణకు బిగ్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

  • Published Aug 31, 2024 | 7:47 AM Updated Updated Aug 31, 2024 | 7:47 AM

Weather Report, Heavy Rains In Andhra Pradesh And Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో.. రాబోయే రెండు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.

Weather Report, Heavy Rains In Andhra Pradesh And Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో.. రాబోయే రెండు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.

AP, Telangana Rains: ఏపీ, తెలంగాణకు బిగ్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని సూచించింది. అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక పాకిస్థాన్ ఈశాన్య అరేబియా సముద్రం మాలేగాన్ , బ్రహ్మపురి జగదల్పూర్, కళింగపట్నం మీదుగా ఆగ్నేయ దిక్కులో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది. ఆ కారణంగా తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఏపీలో సైతం పశ్చిమవాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దాంతో ఏపీకి సైతం వర్షం ముప్పుఉంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం.. వాయుగుండంగా బలపడుతుండటంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రెండు రోజులు(శని, ఆది) భారీ వర్షాలు కురిసే ఛాన్స్ లు ఉన్నాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దాంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. అల్పపీడన ప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనంతపురం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy Rains in AP and TG

ఈ జిల్లాలతో పాటుగా కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక తెలంగాణలోని జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగిలిన జిల్లాలు అయిన ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, ములుగు, నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. దాంతో 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.