ఏపీకి మరో వాయుగుండం ముప్పు .. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

గత రెండు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం బలపడటంతో.. మరీంత బలపడటంతో నేడు ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని తాజాగా వాతవరణ శఆఖ హెచ్చరించింది.

గత రెండు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం బలపడటంతో.. మరీంత బలపడటంతో నేడు ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని తాజాగా వాతవరణ శఆఖ హెచ్చరించింది.

ఇటీవలే ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలు ఉద్ధృతికి కొలుకుంటున్న ప్రజలకు ఇప్పటిలో వర్షాలు వీడే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. గత రెండు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో.. ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, గోపాలపూర్‌ (ఒడిశా)కు 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తాజాగా వాతావరణశాఖ  తెలిపింది.

ఇకపోతే సోమవారం ఉదయంలోగా ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశముందని.. రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే..  నేడు(సోమవారం) కూడా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని తాజాగా వాతవరణ శాఖ ప్రజలకు హై అలర్ట్ ను జారీ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత రెండు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం బలపడటంతో.. రాబోయే మూడు రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక ఈ వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా మారిందని, ఈ క్రమంలోనే..  గంటకు గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. అలాగే మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లరాదని.. విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబరు హెచ్చరికలు జారీ చేయగా, మరోవైపు మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు హెచ్చరికలను అధికారులు జారీ చేశారు.

ఇకపోతే ఈ వాయుగుండం ప్రభావంతో.. ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయడమే కాకుండా.. విద్య సంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ, ఏపీలోని ఈ జిల్లాల్లకు భారీ వర్షాలు కురవనున్నయని వాతవరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments